తెలంగాణ

జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ అమలుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ జిల్లాల ఏర్పాటును సవాలు చేస్తూ సత్యప్రసాద్, చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన మూడు పిల్స్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ సునీల్ చౌదరి విచారించారు. ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున సత్యప్రసాద్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లో ఉన్న ప్రాంతాలను పునర్విభజన చేయరాదని కోరారు. గిరిజన ప్రాంతాల్లో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగం గవర్నర్‌కు మాత్రమే అధికారాలను ఇచ్చిందన్నారు. గిరిజన ప్రాంతాల భౌగోళిక సరిహద్దులను రాష్టప్రతి ఒక్కరే నోటిఫై చేస్తారన్నారు. రాష్టప్రతి గవర్నర్‌ను సంప్రదించి నోటిఫై చేస్తారన్నారు. ఈ కేసును దసరా సెలవుల అనంతరం విచారించేందుకు వీలుగా వాయిదావేశారు.