తెలంగాణ

కన్నుల పండువగా సద్దుల బతుకమ్మ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, అక్టోబర్ 6: కరీంనగర్ జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి కొలువైన వేములవాడ పట్టణంలో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే రీతిలో జరిగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళాలోకం మూలవాగుకు తరలివచ్చింది. సద్దుల బతుకమ్మ వేడుకతో ఊరూవాడా ఉత్సవ వాతావరణం నెలకొంది. రంగురంగుల పూలతో బతుకమ్మలను చేసిన మహిళలు సాయంసంధ్యలో ఊరి మధ్యకు చేరి అంతా ఆడి, పాడారు. మూలవాగులోని బతుకమ్మ తెప్పలో బతుకమ్మలను మహిళలు నిమజ్జనం చేశారు.