తెలంగాణ

వరంగల్‌లో విభజన చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 6: వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాల విభజన ప్రక్రి య గులాబీ పార్టీ మధ్య చిచ్చురేవుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని జనగామలో కలపడంపై డి ప్యూటీ సిఎం కడియం శ్రీహరి వర్గం తో పాటు అఖిలక్ష నాయకులు వ్యతిరేకిస్తుండగా నియోజకవర్గ ఎమ్మెల్యే , మాజీ డిప్యూటీ సిఎం డాక్టర్ టి. రాజయ్య వర్గం కొత్తగా ఏర్పాటు కానున్న జనగామ జిల్లాలోనే కలపాలని పట్టుపడుతున్నారు. మరో 24 గంటల్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్న నేపథ్యంలో జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలను తెలిపేందుకు ఎంపి కేశవరావు నేతృత్వంలో నియమించిన హైపవర్ కమిటీ వద్దకు స్టేషన్‌ఘనపూర్‌కు చెందిన రెండు వర్గాల నాయకులు ఐదు బస్సుల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఇదిలాఉండగా కాదనుకున్న జనగామ జిల్లాకు సిఎం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ములుగును కూడా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసారు. సిఎం కెసిఆర్‌కు పిండప్రధానం చేసారు. జిల్లా ఏర్పాటుకు సిఎం కెసిఆర్‌ను ఒప్పించడంలో మంత్రి అజ్మీరాచందూలాల్ విఫలమయ్యారని ఆరోపిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు మిన్నంటాయి. దాదాపు ఆరు గంటలపాటు ములుగులో రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేయగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి చందూలాల్ రాజీనామా చేయాలని అఖిలపక్ష నాయకులు పట్టుబడుతున్నారు. బస్సు అద్దాల ధ్వంసంతో పోలీసులు టిడిపి మాజీ ఎమ్మెల్యే సీతక్క సహా మరో ముగ్గురిని అరెస్టు చేసారు. చేర్యాలను సిద్దిపేట జిల్లాలో కలపవద్దని డిమాం డ్ చేస్తూనే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చే యాలని, జనగామ, సిద్దిపేట ఏ జిల్లా లో కలిపినా చేర్యాలను మాత్రం డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్‌ఎస్‌లోని రెండు వర్గాలు, అఖిలపక్ష నాయకులు గురువారం హైపవర్ కమిటీ వద్దకు వెళ్లారు.

చిత్రం.. ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ
సిఎం కెసిఆర్‌కు పిండప్రదానం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు