తెలంగాణ

రాష్ట్ర కార్యక్రమంగా వాల్మీకి జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: మహర్షి వాల్మీకి జయంతిని ‘రాష్ట్ర కార్యక్రమం’ (స్టేట్ ఫంక్షన్) గా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పేరుతో శుక్రవారం జీఓ (నెంబర్ 2199) జారీ అయింది. ఈ నెల 16 న వాల్మీకి జయంతి జరుపుకుంటున్నారు. వాల్మీకి జయంతి వేడుకలను జిల్లాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బిసి సంక్షేమ శాఖకు కేటాయించిన బడ్జెట్ నుండి ఇందుకోసం అవసరమైన నిధులను వినియోగించుకోవాలని జీఓలో సూచించారు.