తెలంగాణ

ఏడు జిల్లాలు.. ఒకే జిల్లా పరిషత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 7: దసరా అనంతరం కరీంనగర్ జిల్లా పరిషత్ రికార్డు సృష్టించబోతుంది. అది అషామషీ కాదు..రాష్ట్రంలో మరే జడ్పీకి దక్కని రికార్డును సొంతం చేసుకోబోతుంది. ఒకటి కాదు.. రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఏడు జిల్లాలకు ప్రాతినిత్యం వహించబోతుంది. సువిశాల విస్తీర్ణం కలిగి, 57 మండలాలతో కొనసాగుతున్న కరీంనగర్ జిల్లాను జిల్లాల విభజన ప్రక్రియలో నాలుగు జిల్లాలుగా విభజించారు. 57మండలాలతో కొనసాగుతుండగా, తాజాగా మరో 22మండలాలు కొత్తగా ఏర్పాటు చేయనుండగా, మొత్తం 79 మండలాలకు చేరింది. వీటిని ఆయా ప్రాంతాలకు సమీపంలో ఉన్న జిల్లాల్లో చేర్చగా, 15మండలాలతో కరీంనగర్ జిల్లా, 14 మండలాలతో సిరిసిల్ల జిల్లా, 15మండలాలతో జగిత్యాల జిల్లా, 14మండలాలతో పెద్దపల్లి జిల్లాలు ఏర్పాటుకాబోతున్నాయి. మిగిలిన మండలాలు పక్క జిల్లాల్లోకి వెళ్తున్నాయి. తూర్పున కొత్తగా ఆవిర్భవించబోతున్న జయశంకర్ (్భపాలపల్లి) జిల్లాలోకి మహాదేవ్‌పూర్, పలిమెల, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాలను చేర్చగా, వరంగల్ రూరల్ జిల్లాలోకి కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలను, అలాగే కోహెడ, హుస్నాబాద్, హుస్నాబాద్ రూరల్, బెజ్జంకి మండలాలను సిద్దిపేట జిల్లాలో కలిపారు. అయితే, జిల్లాలు మారినా జిల్లా పరిషత్‌ను విభజించకపోవటంతో వచ్చే ఎన్నికల (2019) వరకు పూర్వ 57 మండలాలకు చెందిన జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులంతా ప్రస్తుత కరీంనగర్ జడ్పీలోనే సమావేశం కావాల్సి ఉంటుంది. వీరితోపాటు ఆయా జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం కూడా విధిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఏడు జిల్లాలకు చెందిన అధికారులు, సిబ్బంది కలుపుకుని సుమారు 300కుపైగా హాజరయ్యే అవకాశాలుంటాయి. ప్రజాప్రతినిధులు మాత్రం 120 మంది వరకు మాత్రమే ఉండగా, వీరికి రెండింతలకు మించి అధికారులు, సిబ్బంది ఉండటడంతో ఇకముందు జరిగే సమావేశాలు జంబోజెట్ సమావేశాలను తలపించే అవకాశాలున్నాయి. ఇప్పటికే జడ్పీ సమావేశం కొనసాగిన ప్రతిసారీ జడ్పీ సమావేశ మందిరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కిక్కిరిపోయేది. మొత్తానికి కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ఏడు జిల్లాలకు చెందిన జడ్పీటిసిలు, ఎంపిపిలకు ప్రాతినిధ్యం వహించనుండగా, దసరా అనంతరం నిర్వహించే జడ్పీ సమావేశంలో ఇటు జడ్పీ సిబ్బందికి, అటు ఆయా జిల్లాల నుంచి వచ్చే అధికారులకు ఇక్కట్లు తప్పవేమోనని ప్రజాప్రతినిధులే పేర్కొంటుండటం గమనార్హం.

చిత్రం.. కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం