తెలంగాణ

జిల్లాల ఏర్పాటులో పారదర్శకత లోపించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 7: కేంద్రం తెలంగాణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిందని.. కానీ టిఆర్‌ఎస్ నాయకులు కేంద్రంపై అక్కసు కక్కడం మంచి పద్ధతి కాదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హితవు పలికారు. మహబూబ్‌నగర్‌లో రెండు రోజుల పాటు జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముగింపు సమావేశానికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, అన్సరాజ్ గంగారామ్ అయ్యర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి బలమైన శక్తిగా ఎదుగుతుందని టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తయారవుతుందనే భయంతో కేంద్రంపై కెసిఆర్‌తో పాటు పలువురు టిఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణకు బదులుగా రాజకీయ తెలంగాణగా తయారు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కొత్త జిల్లాల ఏర్పాటును బిజెపి స్వాగతిస్తుందని అయితే శాస్ర్తియమైన విధంగా జిల్లాల ఏర్పాటు జరగకపోవడం బాధాకరమన్నారు. చట్టబద్ధతలేని హైపవర్ కమిటీకి నిర్ణయం తీసుకునే అధికారం ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు.