తెలంగాణ

చల్లారని విభజన చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 7: కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసినా వరంగల్‌లో జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. 27 జిల్లాలకు పైగా కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని మాత్రం చెపుతున్నారు. తాజా ఆందోళనల నేపథ్యంలో జిల్లాల ఏర్పాటుపై ఫైనల్ డ్రాఫ్టు విడుదల చేసే వరకు గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, చివరిలో జిల్లాల ఏర్పాటులో స్ధానం దక్కించుకున్న జనగామ, గద్యాల, సిరిసిల్ల , ఆసిఫాబాద్ జిల్లాల ప్రతిపాదనమాత్రం హైపవర్ కమిటీ మంత్రివర్గ సమావేశంలో పెట్టారు. గత మూడు రోజులుగా అఖిలపక్షం అధ్వర్యంలో ఆందోళనలతో ములుగు అట్టుడుకుతోంది. కొందరు యువకులు సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించగా, మరికొందరు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. నర్సంపేటలో కూడా ఆందోళనలు ఉద్ధృత మయ్యాయ. నర్సంపేట కేంద్రంగా వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు చేయాలనిడిమాండ్ చేస్తూ శుక్రవారం టిఆర్‌ఎస్ మినహా అన్ని పార్టీల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు కానున్న జనగామ జిల్లాలో కలిసేది లేదంటూ నల్కొండ జిల్లా గుండాల, మోత్కూరు ప్రజలు ఆందోళనలు చేస్తుండగా స్టేషన్‌ఘనపూర్, జఫర్‌గడ్ మండలాల ప్రజలు కూడా తాము జనగామ జిల్లాలో కలిసేది లేదంటూ అఖిలపక్షం అధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. అయితే, జిల్లాల ఏర్పాటు ఆందోళనలను దృష్టిలోపెట్టుకునే ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వడం లేదు. జిల్లాల ప్రారంభోత్సవానికి ఒకరోజుముందే ఫైనల్ డ్రాఫ్టు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు కొత్త జిల్లాలలో మాత్రం పనులు వేగంగా జరుగుతున్నాయి.