తెలంగాణ

పెట్టుబడులతో రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండోరోజు సుమారు 15 మందికిపైగా పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హెచ్‌పి, జెకె టైర్స్, జీఈ, జడ్‌టిఇ, అశోక్ లేలాండ్, డిహెచ్‌ఎల్, సీమెన్స్, భారత్ ఫోర్జ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన కెటిఆర్.. తెలంగాణకు పెట్టుబడులతో రావాలని, ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. వారితోపాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సిఐఐ ప్రతినిధులతో కూడా మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. వారితో ముఖ్యంగా తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సహకారం అందించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ముందుగా భారత్ ఫోర్జ్ కంపెనీ ఎండి నీల్‌కాంత్ కళ్యాణిని మంత్రి కెటిఆర్ కలిశారు. ప్రధానంగా ఎయిరోస్పెస్, రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న ఎయిరో టెక్నాలజి యూనివర్సిటి ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వీలైనంత త్వరలో హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సమావేశం అవుతానని నీల్‌కాంత్ కళ్యాణి కెటిఆర్‌కు తెలిపారు. అనంతరం జెకె టైర్స్ చైర్మన్ రఘుపతి సింఘానియాతో సమావేశమైన కెటిఆర్.. తెలంగాణలో పేపర్ మిల్లింగ్ రంగంలో ఉన్న అవకాశాలను ఆయనకు తెలిపారు. తెలంగాణలోని సిర్పూర్‌లో పేపర్ మిల్లును పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. సింఘానియా సైతం త్వరలో హైదరాబాద్ పర్యటనకి వస్తానన్నారు. తర్వాత హెచ్‌పి ఇండియా ఎండి నీలమ్ ధావన్‌తో మంత్రి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో సంస్థ కార్యకలాపాల విస్తరణ, స్మార్ట్ సిటి సొల్యూషన్లకు సంబంధించిన అంశాలు ఆమెతో చర్చించారు. తెలంగాణలో ఒక పట్టణాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని స్మార్ట్ సిటి సొల్యూషన్లతో మార్పు తీసుకురావాలన్న మంత్రి కెటిఆర్ ప్రతిపాదనను హెచ్‌పి సంస్థ అంగీకరించింది. అనంతరం లాజిస్టిక్స్ దిగ్గజం డిహెచ్‌ఎల్ ఎండి వికాస్ అనంద్‌తో జరిగిన సమావేశంలో తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న డ్రైపోర్టు గురించి చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి లాజిస్టిక్స్ రంగంలో అనేక అవకాశాలున్నట్లు తెలిపారు. తర్వాత అశోక్ లేలాండ్ సిఇఒ వినోద్ కె దాసరితో మంత్రి కెటిఆర్ సమావేశమై తెలంగాణలో అశోక్ లేలాండ్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. మొబైల్, టెలికామ్ రంగ సంస్థ జడ్‌టిఇ, బ్రిటిష్ టెలికామ్ సంస్థల ప్రతినిధులతోనూ ఫైబర్‌గ్రిడ్‌కు అవసరమైన టెలికామ్ పరికారాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. యాక్సెంచర్ గ్రూప్ చైర్ పర్సన్ రేఖ మల్హోత్రా మీనన్‌తో కూడా సమావేశమై తెలంగాణలో సంస్థ విస్తరణను కొనసాగించాల్సిందిగా కోరారు. వీరితోపాటు సీమెన్స్ ఇండియా ఎండి సునీల్ మాథుర్‌తో కూడా సమావేశమైయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహణలో కీలకపాత్ర పోషించిన ఫిలిప్ రాస్లోర్‌తో సమావేశమై ఆయన్ని తెలంగాణలో పర్యటించాలని కోరారు. అయతే దావోస్‌లో త్వరలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు భాగసామ్యం కల్పించనున్నట్లు ఫిలిప్ తెలిపారు. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి పనిచేస్తున్న సిఐఐ టాప్ లీడర్‌షిప్‌తో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. వీరితోపాటుగా సిఐఐ అధ్యక్షుడు నౌషద్ ఫోర్బ్స్, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు.

చిత్రం.. ఢిల్లీలో పారిశ్రామికవేత్తలను కలిసిన మంత్రి కెటిఆర్