తెలంగాణ

తేలుతున్న నీటి లెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ జల చౌర్యానికి పాల్పడుతోందని తెలంగాణ చేసిన ఫిర్యాదుతో కృష్ణా యజామాన్య బోర్డు ఉమ్మడి పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. ఉమ్మడి పర్యవేక్షణ మంచి ఫలితాలను ఇస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితిలో కృష్ణా యాజమాన్య బోర్డు ప్రేక్షక పాత్రను విడిచి పెట్టి కార్యాచరణ ప్రారంభించడం వల్ల ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగించుకుంటోంది అనే లెక్కలు స్పష్టంగా నమోదు అవుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర కృష్ణా జలాల విడుదలను ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల బృందం పర్యవేక్షిస్తోంది. శుక్రవారం ఎనిమిదివేల క్యూసెక్కుల నీటి విడుదలను జాయింట్ మానిటరింగ్ టీమ్ నమోదు చేసింది. తెలంగాణ, ఆంధ్ర నీటిపారుదల శాఖ అధికారులు నీటి తరలింపును రికార్డు చేస్తున్నారు.