రాష్ట్రీయం

పోలవరం ముంపుపై ఎందుకు మాట్లాడవు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి సలహాలు, సూచనలు తమకు అవసరం లేదని ఎఐసిసి నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని సుధాకర్ రెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. పోలవరం ముంపు గురించి రేవంత్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. పెద్ద బాబు, చిన్న బాబు చెప్పినట్లు నడుచుకునే రేవంత్ తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులైన ఎస్. జైపాల్ రెడ్డి, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి ప్రభృతులపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కెకె అధ్యక్షతన ఏర్పాటైన హైపవర్ కమిటీ గాలి కమిటీ అని ఆ కమిటీని కాంగ్రెస్ నేతలు కలిసారని రేవంత్ రెడ్డి చేసిన విమర్శపై సుధాకర్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. గాలి కమిటీ, జైలు కమిటీలన్నీ రేవంత్‌కే తెలుసునని అన్నారు. ఏ చంద్రునితో ఏ చంద్రుడు కుమ్మక్కయ్యారో రేవంత్ ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.