తెలంగాణ

రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమ్మపేట, ఫిబ్రవరి 4: నూతన సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకుని అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. మండల పరిధిలోని అప్పారావుపేటలో రూ.72 కోట్ల పామాయిల్ ఫ్యాక్టరీ పనులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పోచారం ప్రారంభించారు. సదస్సులో పోచారం మాట్లాడుతూ.. జీవన ఎరువులు, ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలోనే ఆయిల్‌ఫామ్ అత్యధికంగా సాగవుతుందని, ఆయిల్‌ఫామ్ తోటల ద్వారా పచ్చదనం, పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రిప్ ఇరిగేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా నిధులు వెచ్చిస్తుందన్నారు. రానున్న బడ్జెట్‌లో రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్లు కేవలం లిఫ్ట్ ఇరిగేషన్‌కే వెచ్చించనున్నామన్నారు. రాష్ట్రంలో 17 లక్షల హెక్టార్ల మెట్ట భూములు సాగవుతున్నాయని, కేవలం 5 లక్షల హెక్టార్లకే డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ఉందని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని రైతులందరికీ అందిస్తామని రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అప్పారావుపేటలో నిర్మించనున్న ఫ్యాక్టరీ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నామన్నారు. రైతులను నష్టపరిచి, వారిని ఏడిపించే వారు మట్టి కొట్టుకుపోతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీ నాడు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్నది తానేనని చెప్పారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తానే బీజాలు వేశానని, పెరిగిన పామాయిల్ కారణంగా మరో ఫ్యాక్టరీ కావాల్సిన ఆవశ్యకతను ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద తాను పోరాటం చేసి సాధించానన్నారు. కానీ కొన్ని శక్తులు అప్పారావుపేటలో ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. నాడు ఖమ్మం జిల్లాలో అతి స్వల్పంగా ఉన్న తారు రోడ్లను గ్రామగ్రామాన నిర్మించిన ఘనత తనదేనన్నారు. జిల్లాకు అత్యధిక నిధులు తీసుకొస్తున్నానని, సొంత మండలం దమ్మపేటకు మరిన్ని నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో అధికారులు సైతం ఆసూయ పడేలా రైతులు లాభాలు ఆశిస్తారని ఆకాంక్షించారు. మంత్రులు రూ.7 కోట్లతో నిర్మించే మొద్దులగూడెం- గుండుగులపల్లి డబుల్‌రోడ్డు విస్తరణ పనులకు, మందలపల్లి క్రాస్‌రోడ్డు డబుల్‌రోడ్ విస్తరణ పనులకు, రూ.7 కోట్లతో నిర్మించే మందలపల్లిరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మందలపల్లి చేరుకున్న మంత్రులకు నాయకులు, కార్యకర్తలు డప్పు వాయిద్యాలు, కొమ్ము నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి