తెలంగాణ

ఆహార కల్తీకి కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తినే తిండి కూడా కల్తీ అవుతోంది. దీన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అని సిఎం కె చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ప్రజలను కల్తీనుంచి కాపాడేందుకు రాష్ట్ర ఉద్యానవన శాఖ క్రియాశీలకం కావాలన్నారు. పండ్లు, కూరగాయలు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి ఇలా ప్రతిదీ కలుషితమవుతోందని, కల్తీలేని వస్తువంటూ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏది తినాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందని, ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గాన్ని ఉద్యానవన శాఖ కల్పించాలని ఆదేశించారు. రసాయనాలు ఎక్కువగా వాడని కూరగాయలు, పండ్లు, కల్తీలేని మసాలాలు అందుబాటలో తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. రైతులు లాభసాటి వ్యవసాయం చేసేలా, రాష్ట్ర అవసరాలకు సరిపడా పండ్లు, కూరగాయలు, మసాలాలు, పువ్వులు రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యానవన శాఖను విస్తరించాల్సిన అవసరముందని, శాఖలో మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, మెకనైజేషన్ లాంటి విభాగాలు ఏర్పాటుచేసి అదనపు సంచాలకులను నియమించాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో శనివారం హార్టీకల్చర్‌పై సిఎం సమీక్షించారు. మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, హార్టీకల్చర్ డైరెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. కల్తీ బారినుంచి కాపాడేలా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెస్ చేయాలని సూచించారు. నగర శివార్లలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగానే కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి లాంటి వస్తువులు అందించాలని చెప్పారు. దీనికోసం ఉద్యాన శాఖలో అదనపు సంచాలకుడిని, అవసరమైన సిబ్బందిని నియమించాలని సిఎం ఆదేశించారు.
కరివేపాకు దిగుమతి సిగ్గుచేటు
కోటి జనాభావున్న హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని వివిధ నగరాలు, పట్టణాలకు ప్రతి రోజూ లక్షల టన్నుల కూరగాయలు, పండ్లు, పాలు అవసరమవుతాయన్నారు. వీటిలో 90శాతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణ బిడ్డలు పొట్టచేత పట్టుకొని దుబాయ్ వెళ్తుంటే, మనకు కావాల్సిన కూరగాలు, చివరకు కరివేపాకు సైతం దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి కావలసిన పండ్లు, కూరగాయలు ఇక్కడే పండించాలని సూచించారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని, మైక్రో ఇరిగేషన్‌కు సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. ఉద్యాన శాఖ అధికారులు వ్యవసాయ భూములను జోన్లుగా విభజించి రైతులు ఎక్కడ ఏపంట సాగుచేయాలో సూచించాలన్నారు.
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఇతర పంక్షన్లకు పెద్దఎత్తున పూలు అవసరమవుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని, ఇక్కడే పూలు పండించే విధంగా రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పాలిహౌజ్‌లు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎన్ని కావాలి? ఎంత ఉత్పత్తి అవుతుంది తదితర అంశాలతో సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన శాఖ విస్తరణకు అదనంగా ఉద్యోగులను నియమించాలని ఆదేశించారు. వచ్చే జూన్‌నాటికి ఉద్యాన వన ప్రణాళిక రూపొందించాలని సిఎం అధికారులను ఆదేశించారు.