తెలంగాణ

విధేయులకే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: ఎట్టకేలకు నామినేటెడ్ పదవుల పందేరానికి ముఖ్యమంత్రి కెసిఆర్ దసరా పండుగ సందర్భంగా శ్రీకారం చుట్టారు. పార్టీ విధేయులకే నామినేటెడ్ పదవులు దక్కాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కొందరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా అవకాశం కల్పించారనే అపప్రధ ముఖ్యమంత్రిపై ఉన్న సంగతి తెలిసిందే. దీనినుంచి బయట పడటానికి నామినేటెడ్ పదవుల పందేరంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారికే అవకాశం కల్పించారు. టిఆర్‌ఎస్ పార్టీ అవిర్భావం నుంచి పార్టీలోనూ, తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీలక భూమిక పోషించిన వారికే కార్పొరేషన్ పదవులు దక్కాయి. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన తొమ్మిదిమందీ మొదటినుంచి పార్టీలో ఉన్నవారే. వారిలో నలుగురు వరంగల్ జిల్లాకు చెందినవారు కావడం మరో విశేషం. పెద్ది సుదర్శన్‌రెడ్డి, మర్రి యాదవరెడ్డి, కనె్నబోయిన రాజయ్య యాదవ్, లింగంపల్లి కిషన్‌రావు వరంగల్ జిల్లాకు చెందినవారు. గతంలో వీరిలో కొందరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు ఆశించినప్పటికీ రాజకీయ సమీకరణల వల్ల టిక్కెట్లు ఇవ్వలేకపోయామని, నామినేటెడ్ పోస్టులు ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా, బండా నరేందర్‌రెడ్డి నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా గతంలో పని చేశారు. టిఆర్‌ఎస్ స్థాపించిన తర్వాత తొలిసారి జడ్పీటిసి ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సుదర్శన్‌రెడ్డి ఓటమి పొందగా, తాజాగా కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. రాజయ్య యాదవ్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా పని చేశారు. లింగంపల్లి కిషన్‌రావు టిఆర్‌ఎస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా పని చేశారు. వరంగల్ జిల్లా పరకాల జడ్పీటిసి స్థానం గతంలో మహిళకు రిజర్వు కావడంతో అప్పట్లో కిషన్‌రావు భార్యకు జడ్పీటిసిగా అవకాశం లభించింది. మర్రి యాదవరెడ్డి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్‌కు వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశారు. తన ఆధ్వర్యంలోని అసోసియేషన్‌ను ఆయన టిఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేశారు. మందుల శ్యామెల్ టిఆర్‌ఎస్ విభాగం ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షునిగా ఉన్నారు. పార్టీపై దళిత నేతలనుంచి వచ్చిన విమర్శలను తిప్పికొట్టడంలో ఆయన క్రియాశీలకంగా పని చేశారు. వీరేకాకుండా జి బాలమల్లు, ఈద శంకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి మొదటి నుంచి పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. క్రికెట్ క్రీడాకారుడైన వెంకటేశ్వర్‌రెడ్డి మంత్రి కెటిఆర్‌కు అత్యంత విధేయుడు.

చిత్రం.. బండా నరేందర్‌రెడ్డి