తెలంగాణ

వాళ్లకేం తెలుసు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 9: జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో విపక్షాలు విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నాయని సిఎం కె చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ప్రభుత్వం చేపట్టే ప్రజోపయోగకర కార్యక్రమాల కారణంగా ఉనికి కోల్పోతామనే భయంతో కాంగ్రెస్, తెదేపాలు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల్లో లేనిపోని ఆందోళనలు రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎప్పుడు ఏ సమస్యలపై ఆందోళనలు చేయాలో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. ఆదివారం వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయాన్ని సతీసమేతంగా దర్శించుకున్న సిఎం చంద్రశేఖర్‌రావు 3.7 కోట్ల విలువచేసే 11.7 కేజీల బంగారంతో తయారు చేయించిన కిరీటం, కర్ణ్భారణాలు, జటాజూటాలను అమ్మవారికి సమర్పించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటులో శాస్ర్తియత లేదని కాంగ్రెస్ చెబుతోందని, అసలు శాస్ర్తియత అంటే ఏమిటో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కొత్త జిల్లాల విషయంలో రెండేళ్లుగా కసరత్తు జరుగుతోందని గుర్తు చేశారు. కేబినెట్ భేటీలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని నిర్ణయించి సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి కలెక్టర్ల నుంచి సమాచారం తీసుకుని, వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాతే కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టామన్నారు. అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ నేతలు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని, ప్రజలు తమ చుట్టూ తిరగాలనే వైఖరితో వ్యవహరించారని ఆరోపిస్తూ తమ ప్రభుత్వం పాలనను ప్రజల దగ్గరకు చేర్చే ప్రయత్నంలో ఉందన్నారు. అప్పట్లో దివంగత ఎన్టీఆర్ హయాంలో మండల వ్యవస్థను అమలులోకి తీసుకొస్తే అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు జరిగాయని, కానీ ఈ వ్యవస్థ ఫలితాలు ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయని గుర్తు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనూ అద్భుత ఫలితాలు అందుతాయని, కొత్త జిల్లాల ఏర్పాటు సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుందని సిఎం స్పష్టం చేశారు. ‘కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడని ప్రశ్నించిది ప్రతిపక్షాలే. కొత్త జిల్లాల ఏర్పాటు చర్యలు ప్రారంభిస్తే మరిన్ని జిల్లాలు కావాలని ఆందోళనలు చేయిస్తుది ప్రతిపక్షాలే. తాజాగా కొత్త జిల్లాల అవసరమా? శాస్ర్తియత లేదంటూ అడ్డుకోవాలని ప్రయత్నిస్తుదీ ప్రతిపక్షాలేనంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కనీస అవగాహన లేకుండా పిసిసి అధ్యక్షుడు జిల్లాల ఏర్పాటుపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహించారు. మేము చేయం, ఎవరైనా చేస్తే ఊరుకోం ఆనే ధోరణితో కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. చెట్టుకొకరు, పుట్టకొకరులా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలు ప్యూడలిస్టులుగా, అంతా తాము చెప్పిందే జరగాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమస్యలపై స్పందించటం తెలియదు. ఎప్పుడు ఏ విషయంలో ఆందోళనలు చేపట్టాలో తెలియదని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో భారీవర్షాలు కురిసి చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండిపోయాయని, రైతులు రెండో పంటకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ రైతు సమస్యలపై ఆందోళనలు అనటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సిపిఎం, ఇప్పుడు రైతాంగ సమస్యలపై పాదయాత్రకు సిద్ధమవుతోందంటూ, అసలు ఈ పార్టీకి తెలంగాణపై మాట్లాడే హక్కే లేదని, ప్రజలు వీరిని నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండున్నర లక్షల నుంచి నాలుగు లక్షలలోపు కుటుంబాలు ఉండేలా ఒక జిల్లాను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దీనివల్ల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ అద్భుతంగా జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందని, ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతాయన్నారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోందని, త్వరలో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుందన్నారు. కొత్త జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలని వస్తున్న డిమాండ్ గురించి మాట్లాడుతూ తెలంగాణకు చెందిన పివి నరసింహారావు, రావి నారాయణరెడ్డి, జి వెంకటస్వామి తదితర చాలామంది ప్రముఖుల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, వివిధ పద్ధతుల్లో వారిపేర్లు చిరస్థాయిగా నిలచిపోయేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూరె్తైన అనంతరం నామినేటెడ్ పదవులపై దృష్టి పెడతామన్నారు. విలేఖరుల సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్, ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... భద్రకాళి మొక్కు తీర్చుకుంటూ అమ్మవారి ఆభరణాలను అర్చకులకు అందిస్తున్న సిఎం కెసిఆర్ దంపతులు