తెలంగాణ

పదవుల పందేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: ఎప్పుడెప్పుడా అని అధికార తెరాస పార్టీ నేతలు ఎదురు చూస్తోన్న నామినేటెడ్ పదవుల పందేరానికి దసరా కానుకగా సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. 9 కార్పొరేషన్లకు చైర్మన్లను ఆదివారం ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ కష్టపడిన కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో నియామకాలు జరిపినట్టు పేర్కొన్నారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా మందుల శ్యామెల్, ఫీష్ అండ్ మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కనె్నబోయిన రాజయ్య యాదవ్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా పెద్ది సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా జి బాలమల్లు, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ ఎ వెంకటేశ్వర్‌రెడ్డి, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఈద శంకర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బండా నరేందర్‌రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కూడా) చైర్మన్‌గా మర్రి యాదవరెడ్డి, స్టేట్ అగ్రోస్ చైర్మన్‌గా లింగంపల్లి కిషన్‌రావును నియమించారు. అధికారిక ఉత్తర్వులు సోమవారం అందనున్నాయి.