తెలంగాణ

నత్తనడకన నరుూం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపట్టిన గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూం కేసు దర్యాప్తు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి సాగుతోంది. నరుూం పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమై నేటితో రెండు నెలలు పూర్తి కావచ్చినా.. దర్యాప్తు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. నరుూం కేసు పోలీస్ ఇన్‌ఫార్మర్ల గుండెల్లో గుబులు రేపుతోంది. రెండు నెలలుగా మూడు కోణాల నుంచి కొనసాగుతోన్న దర్యాప్తు, నేటికీ ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం పట్ల దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరుూం కేసులో ఇప్పటివరకు ప్రత్యేక దర్యాప్తు బృందం నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో మొత్తం 99 కేసులు నమోదు చేసి, 128 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో 38 మంది నరుూం కుటుంబ సభ్యులు, బంధువులే ఉన్నారు. మిగతావారిలో నరుూం ముఖ్య అనుచరులు, మాజీ పోలీస్ బాస్‌లు, ప్రజాప్రతినిధులు ఉన్నట్టు గుర్తించినట్టు సిట్ ప్రకటించింది. అయితే నరుూం ముఖ్య అనుచరుల పేర్లు వారిని అదుపులోకి తీసుకున్నప్పుడే చెప్పారు తప్ప.. తదుపరి విచారణలో ఎక్కడా ప్రస్తావించలేదు. నలుగురైదుగురు ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. కానీ అధికార పార్టీలో కీలక వ్యక్తులుగా కొనసాగుతున్న కొంతమంది పేర్లు బయటకు వచ్చినప్పటికీ వారి అరెస్టు గానీ, వారిపై విచారణ కూడా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నరుూం కేసులో ఎవరినీ వదిలిపెట్టొద్దని ప్రభుత్వం నుంచి సంకేతాలు స్పష్టంగా ఉన్నప్పటికీ మాజీ పోలీస్ బాస్‌లు, ప్రజాప్రతినిధులపై సిట్ విచారణ జరపడం లేదు. ఇదిలావుండగా మూడు నెలల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అంశంపై సిట్ కసరత్తు చేపట్టింది. ఈ కేసులో సరైన ఆధారాలతోనే చార్జిషీట్ దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది.