ఆంధ్రప్రదేశ్‌

8రోజుల్లో తిరుమలకు రూ.20 కోట్ల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 10: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇటు వాహన సేవలు చూడటానికే కాకుండా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు పోటెత్తారని ఆలయ డిప్యూటీ ఇఓ కోదండరామారావు తెలిపారు. సోమవారం స్థానిక మీడియా సెంటర్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 8 రోజుల వ్యవధిలో 6.74 లక్షల మంది మూలవిరాట్టును దర్శించుకున్నారని, వారు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా 17.30 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, బోర్డు సభ్యులు, ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు, జెఇఓ శ్రీనివాసరాజు ఇచ్చిన సూచనల మేరకు సిబ్బంది విశేష సేవలందించారన్నారు. ప్రధానంగా బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు తిలకించడానికి దేశం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చినా శ్రీవారి ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల అవసరార్థం 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచే విధంగా ఏరోజుకారోజు లడ్డూల ఉత్పత్తిని చేయడంలో పోటు సిబ్బంది విశేషంగా కృషి చేశారన్నారు. ఒక్క గరుడ సేవ రోజున 4.31 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారని, వారందరికీ సంతృప్తికరమైన దర్శనాన్ని అందించగలిగామన్నారు. ఉత్సవాల సందర్భంగా రోజుకు 40 వేల మందికి తగ్గకుండా కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నారన్నారు. ఉత్సవాల సందర్భంగా విఐపి దర్శనాలను రద్దుచేసి ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులకు మాత్రమే విఐపి దర్శనం కల్పించడం వల్ల ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించినట్లు ఆయన తెలిపారు.