తెలంగాణ

గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం రాజీనామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర అపజయానికి నైతిక బాధ్యత వహి స్తూ, గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఆదివారం పంపనున్నట్లు తెలిపారు. ఇకపై సామాన్య కార్యకర్తగా కొనసాగతానన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనకు పూర్తి బాధ్యతలివ్వలేదని, అయినా పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం తనవంతు ప్రయత్నం చేశానని వివరించారు. ఓటమి పాలవుతున్నామన్న విషయం తనకు ముందుగానే తెలుసునని, అభ్యర్థులకు ఈ విషయం చెప్పినట్లు తెలిపారు.
అంతేగాక, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న గ్రూపు తగాదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కల్గించాయని, గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం విఫలమైందని వివరించారు. టిఆర్‌ఎస్ తరపున గెలుపే లక్ష్యంగా పెట్టుకుని మంత్రి కెటిఆర్ అందర్నీ కలుపుకుని చేసిన కృషి కారణంగానే టిఆర్‌ఎస్ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలుపొందిందని వివరించారు. అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ వల్లే నగరాభివృద్ధి సాధ్యమని గమనించి ప్రజలు ఆ పార్టీని గెలిపించారని తెలిపారు.
ఆ పార్టీ అందర్నీ కలుపుకుని పోవటం వల్లే విజయం సాధించిందని దానం అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలో చేరాలనే ఉద్దేశం ఉంటే ఇప్పటికే చేరేవాడినని, మున్ముందు కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని దా నం స్పష్టం చేశారు.