తెలంగాణ

మహిషాసురమర్దనిగా భద్రకాళీ మాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్(కల్చరల్), అక్టోబర్ 10: వరంగల్ మహానగరంలోని భక్తులకు కొంగుబంగారంలా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవాలయ క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. సోమవారం మహా నవమిని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను జరిపారు. ఇందులో భాగంగా ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, చతుస్థానార్చన ఉషఃకాలార్చనలతో నవమి పూజలను ప్రారంభించారు. అనంతరం సిద్ధిదాత్రీ దుర్గార్చన చేసి మహిషాసురమర్ధినిగా అలంకరించారు. తదుపరి శరభవాహణంపై అమ్మవారిని ఊరేగించారు. ఉత్సవాంగ పూజలలో భాగంగా దిగ్దేవతా బలిప్రదానం కూష్మాండబలి, పూర్ణాహుతి కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సాయంత్రం 7 గంటలకు శుంభహాదుర్గార్చన పుష్పరథ సేవను చేసారు. ఈ కార్యక్రమాలకు కుందూరు చంద్రాకర్‌రెడ్డి రాధిక దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఉత్సవాలను పురస్కరించికొని ఆలయంలో వంశీ అవార్డు గ్రహీత ఉల్లి మనోహర్‌బాబు భక్తిపాటలను ఆలపించారు. అనంతరం ఆలయంలో జరిగిన శాస్ర్తియ సంగీతం, శాస్ర్తియ నృత్యం, పేరిణి లాస్యం వంటి సంగీత నృత్య కళల ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయానికి విచ్చేసిన భక్తులకు భద్రకాళీ సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 5 వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేడు విజయదశమి సందర్భంగా సాయంత్రం 7 గంటలకు తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళీ శేషు తెలిపారు. అంతేకాకుండా ఉదయం అమ్మవారి దేవాలయ సమీపంలోని కీర్తి గార్డెన్స్ ఎదురుగా వాహన పూజలు జరుగుతాయని, కనుక భక్తులు గమనించాలని వారు కోరారు.