తెలంగాణ

వారంలోగా కలెక్టర్ల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్‌పిలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. జిల్లాల పునర్వ్యవస్థీరకణ మంగళవారం జరగడంతో ఆయా జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశనం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో ఈ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సమావేశం ఏర్పాటు చేస్తారని, సమావేశం జరిపే రోజు, సమయాలను గురువారం ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. వారంరోజుల్లోగా ఈ సమావేశం జరగవచ్చని అధికారవర్గాలు వెల్లడించాయి. కొత్త జిల్లాల్లో ఏర్పడే సమస్యలు, జిల్లాస్థాయి అధికారుల మధ్య అవగాహనపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాల అమలు, కార్యక్రమాలను ఏ విధంగా విజయవంతం చేయాలో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు వివరించాలని భావిస్తున్నారు. శాంతిభద్రతలపై చర్చించేందుకు ఈ సమావేశానికి జిల్లాల ఎస్పీలను కూడా ఆహ్వానించాలని భావిస్తున్నారు.