తెలంగాణ

త్వరలో ‘వజ్ర’ మినీ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే క్రమంలో భాగంగా ట్రయల్ రన్‌గా ఏసి మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు టిఎస్‌ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. తెలంగాణలో త్వరలో ‘వజ్ర’ పేరుతో ఏసి బస్సులు నడుపనున్నట్టు ఆయన చెప్పారు. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్‌కు గుర్తించిన రూట్లలో రాకపోకలు సాగిస్తాయన్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రూ. 300, హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు రూ. 350 చొప్పున ప్రయాణ చార్జీ ఉంటుందని చైర్మన్ తెలిపారు. వరంగల్‌కు నాలుగు రూట్లలో, నిజామాబాద్‌కు మూడు రూట్లలో హైదరాబాద్ నుంచి మొత్తం 150 బోర్డింగ్ పాయింట్ల నుంచి ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా బుకింగ్, ఆన్‌లైన్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా యాప్ కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు, సీట్లు అందుబాటులో ఉంటే అరగంట ముందు కూడా బుకింగ్ చేసుకునే వెసలుబాటు ఉంటుందని చైర్మన్ వివరించారు.
మహిళా కండక్టర్‌కు నగదు పురస్కారం
ఓ ప్రయాణికుడు గుండెపోటుకు గురైన సమయంలో తన బాధ్యతగా ఆ ప్రయాణికుడిని సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన ముషీరాబాద్-1 డిపో మహిళా కండక్టర్ ఎ నీలిమను అభినందిస్తూ ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ నగదు పురస్కారం అందించారు. 1జె రూట్ బస్సులో ఓ ప్రయాణికుడు గుండెపోటుకు గురయ్యాడు. అదే బస్సులో విధులు నిర్వహిస్తున్న నీలిమ మానవత్వంతో ఆ ప్రయాణికుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి సకాలంలో చికిత్స అందేవిధంగా సహకారం అందించారు.