తెలంగాణ

కాంగ్రెస్ పాలనవల్లే రైతుల ఆత్మహత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: కాంగ్రెస్ పార్టీ పాపిష్టి పాలన వల్లనే రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. వ్యవసాయాన్ని సర్వనాశనం చేసిన పార్టీ టిడిపి అని, రైతులపై కాల్పులు జరిపిన పార్టీ అని మండిపడ్డారు. బిజెపి నాయకులు కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శాసన మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, శ్రీనివాసరెడ్డిలతో కలిసి పోచారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవడమే ఏకైక అజెండాగా కుట్ర రాజకీయాలు సాగిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రే అవినీతి మయమని అన్నారు. కాంగ్రెస్, టిడిపి, బిజెపిలకు ఎక్కడా డిపాజిట్లు దక్కలేదని గుర్తు చేశారు. టిఆర్‌ఎస్ ఎన్నికల హామీలు అమలు చేయడమే కాకుండా హామీ ఇవ్వని మిషన్ భగీరథ, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, హాస్టళ్లకు సన్నబియ్యం వంటి పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలను నీతి ఆయోగ్‌తో పాటు ప్రధానమంత్రి కూడా అభినందించారని, బిజెపి నాయకులకు ఈ విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా 1250 టిఎంసిలను వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అడ్డుకోవడమే లక్ష్యంగా విపక్షాలు పని చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, టిడిపి హయాంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌వి గాలి మాటలు, రేవంత్‌రెడ్డి పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.