తెలంగాణ

ధార్మిక శక్తులు ఏకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి: అన్ని వైపులా సమస్యలు చుట్టుముట్టి అధార్మిక శక్తులు విచ్చలవిడిగా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో హైందవ సమాజాన్ని వినాశనం నుంచి కాపాడేందుకు సనాతన ధర్మం మీద విశ్వాసం ఉన్నవారంతా విభేదాలను పక్కనపెట్టి ఏకం కావటం అత్యవసరమని ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్ర్తీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం పాత రాజంపేట్ గ్రామంలో ఆర్ష గురుకులం బ్రహ్మ మహావిద్యాలయం ద్వితీయ వార్షికోత్సవ సభ, యోగ సాధన ముగింపు శిబిరానికి ఆయన ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ప్రసంగించారు. విదేశీయులు, అన్య మతస్తులు, హిందువుల్లోని భ్రష్టులు, కుహనా మేధావులు, వారి కొమ్ముకాసే దుష్ట రాజకీయ శక్తులు పథకం ప్రకారం తెరపి లేకుండా సాగిస్తున్న ప్రచ్ఛన్న దాడుల పర్యవసానంగా అభారతీయ ధోరణులు ప్రబలి, మన దేశంలో మనమే పరాయివారమవుతున్నామా? అన్న ఆందోళన కలుగుతోందని ఆయన అన్నారు. ధర్మానికి గ్లాని, దేశానికి హాని ఎప్పుడు కలిగినా ముందు నిలిచి పోరాడిన ఘన చరిత కలిగిన ఆర్యసమాజ్ ఇప్పటి ఆందోళనకర స్థితిగతుల్లోనూ క్రియాశీలంగా కదలాలని ఎం.వి.ఆర్.శాస్ర్తీ పిలుపునిచ్చారు. ఆనాడు సనాతన ధర్మం అంతరించిపోతున్న సమయంలో ఆర్యసమాజం చేపట్టిన ఉద్యమాలు, పోరాటాలతోనే హైందవ సమాజం మళ్లీ ఊపిరి పోసుకుందన్నారు. స్వామి దయానంద సరస్వతి, శ్రద్ధానందజీ, లాలా లజపతిరాయ్ వంటి మహనీయులు ఆర్యసమాజ్ ద్వారా హిందూ ధర్మాన్ని కాపాడారని ఆయన చెప్పారు. హైందవ ధర్మ రక్షణ కోసం స్వామి బ్రహ్మానంద సరస్వతి బ్రహ్మ మహావిద్యాలయాన్ని నడపటం అభినందనీయమన్నారు.
స్వామి బ్రహ్మానంద సరస్వతి మాట్లాడుతూ ఆంగ్ల భాషకంటే సంస్కృత భాషే గొప్పదన్నారు. ఆంగ్లభాషలో 11వేల శబ్దాలుంటే, సంస్కృత భాషలో 10 వేలకోట్ల శబ్దాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా 1884వరకు బోధన అనేదే జరిగేది కాదని, మన దేశ సంస్కృతిని చూసి నేర్చుకున్నాకే విదేశాల్లో నిజమైన బోధన ప్రారంభం అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ నుండి వచ్చిన స్వామి శాంతానంద సరస్వతి, స్వామి ధ్రువదేవ్, స్వామి ఓంప్రకాశ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... కామారెడ్డి మండలంలోని పాతరాజంపేట్ గ్రామ శివారులోని ఆర్ష గురుకులం
ద్వితీయ వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్.శాస్ర్తీ