తెలంగాణ

సాయలక్ష్మి హత్య కేసు వీడిన మిస్టరీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, అక్టోబర్ 14: మేడ్చల్ మండలం ఏల్లంపేట్ గ్రామంలో ఈనెల 12న అతిదారుణంగా హత్యకు గురైన చిన్నారి సాయిలక్ష్మి ప్రసన్న (7) హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలిసింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసి నిర్దారణకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన చిన్నారి ప్రసన్న హత్యోదంతం మిస్టరీని పోలీసులు ఛేదించడంలో సఫలీకృతమైనట్లు తెలిసింది. ఆభం శుభం తెలియని చిన్నారిని అంత దారుణంగా గొంతు, ఎడమచేతి మణికట్టు నరాలు కోసి హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎందుకొచ్చింది? అనే కోణంలో పోలీసులు పరిశోధన చేసి విజయం సాధించారు. శుక్రవారం ఎల్లంపేట్ గ్రామంలోనే హత్యకు గురైన చిన్నారి ప్రసన్న ఇంటి పక్కనే ఉండే పిన్నిని మరో వ్యక్తిని పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిన్నారి హత్య కేసులో నిందితులను గుర్తించి ఈమేరకు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మృతురాలి పిన్ని వెంకటలక్ష్మితో పాటు మల్లేశ్ అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రసన్న ఇంటి సమీపంలో ఉండే ఓ మైనర్ బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సాయలక్ష్మి ఇంట్లో ఈ బాలుడు దొంగతనానికి వచ్చినపుడు ఆమె చూడటంతో అందరికీ చెబుతుందేమోనని హతమార్చినట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం ఏ విషయాన్నీ నిర్ధారించడం లేదు. వివరాల కోసం ఫోన్లు చేసినా స్పందించడంలేదు. చివరకు మైనర్ బాలుడే హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించుకుని అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పిన్ని వెంకటలక్ష్మి, మల్లేశ్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా పోలీసులు నేడు (శనివారం) మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి సస్పెన్స్‌కు తెరదించనున్నట్లుగా తెలిసింది.
ఎల్లంపేట్ సందర్శించిన సైబరాబాద్ సిపి
తీవ్ర సంచలనం రేపిన చిన్నారి హత్యగావింపబడిన గ్రామాన్ని శుక్రవారం రాత్రి సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య సందర్శించారు. ప్రసన్న హత్యకు గురైన బాత్‌రూమ్‌ను పరిశీలించారు. తల్లిదండ్రులు కృష్ణమూర్తి, భవానితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిపితో పాటు బాలానగర్ జోన్ డిసిపి సాయిశేఖర్, పేట్‌బషీరాబాద్ ఎసిపి అశోక్‌కుమార్, సిఐ రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు.