తెలంగాణ

మజ్లిస్ చేతిలో టిఆర్‌ఎస్ కీలుబొమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ రాష్ట్ర సమితి, రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ చేతిలో కీలు బొమ్మగా మారాయని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. వికారాబాద్‌ను అనంతగిరి జిల్లాగా, హైదరాబాద్‌ను భాగ్యనగరంగా ఎందుకు మార్చడం లేదని ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తాజాగా మైనారిటీ నాయకులతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌కు మజ్లిస్ మిత్రపక్షం అని చెప్పారని కిషన్‌రెడ్డి తెలిపారు. మజ్లిస్‌తో మిత్రపక్షంగా ఉంటే తమకు అభ్యంతరం లేదు కానీ టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన కొత్తలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరిగిందని, అప్పుడు మజ్లిస్ సహకారం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే ఆక్షేపణీయంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన కుట్రకు కారకులు ఎవరో ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ కుట్రను బహిర్గతం చేసి ప్రజల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ పని చేసేందుకు మజ్లిస్ అనుమతి తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పడంతో ఆ పార్టీ మజ్లిస్ చేతిలో కీలు బొమ్మగా ఉందనేది స్పష్టమైందని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మజ్లిస్ మిత్రపక్షంగా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. పైగా ఇప్పటికే కెసిఆర్ చుట్టూ తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారే ఉన్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్ పాతనగరాన్ని ముఖ్యమంత్రి మజ్లిస్ పార్టీకి ఏమైనా రాసిచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌కు లోగడ ఉన్న భాగ్యనగరం పేరును పునరుద్ధరించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.