తెలంగాణ

ప్రాజెక్టులపై నియంత్రణా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: కృష్ణా జలాలల్లో తెలంగాణ వాటా తేలేదాక శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై నియంత్రణను కృష్ణా నది యాజమాన్య మండలి (కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు-కెఆర్‌ఎంబి) పరిధిలోకి తీసుకోవద్దని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి, కెఆర్‌ఎంబికి వేర్వేరుగా లేఖలు రాసింది. కృష్ణానది ప్రాజెక్టులపై కెఆర్‌ఎంబి నియంత్రణను ఇప్పటికిప్పుడు అంగీకరించేది లేదని తన లేఖలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నియంత్రణకు ముందుగా కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల వారీగా వాటాల కేటాయింపులను తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాల నీటి వాడకంపై ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించడానికి ఈనెల 16న కెఆర్‌ఎంబి సమావేశం కానుంది. కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చకుండా నీటి వినియోగంపై ఎలా నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో కెఆర్‌ఎంబి నిర్వహించిన సమావేశంలో డిసెంబర్ నెలాఖరు వరకు ఇరు రాష్ట్రాలు చెరో 17.7 టిఎంసిల నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. అయితే కృష్ణా డెల్టా ఆయకట్టు కింద పంటలను కాపాడుకోవడానికి తమకు అదనంగా మరో రెండు టిఎంసిల నీటిని కేటాయించాలని ఆంధ్ర ప్రభుత్వం కెఆర్‌ఎంబికి లేఖ రాయగా, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పంటలతో పాటు తాగునీటి అవసరాల కోసం తమకు కూడా అదనంగా నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కూడా కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈనెల 16న జరుగనున్న సమావేశానికి ముందే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల వాటాలు తేలే వరకు ప్రాజెక్టులపై నియంత్రణ అధికారాన్ని బోర్డు పరిధి నుంచి తప్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి, కెఆర్‌ఎంబికి వేర్వేరుగా లేఖలు రాసినట్టు నీటిపారుదల శాఖ అధికార వర్గాల సమాచారం.