తెలంగాణ

విద్యార్థుల సమస్యలపై ఇక తల్లిదండ్రుల పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి రకరకాల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం ఏర్పాటైంది. విద్యా హక్కు చట్టం అమలు, స్కూళ్లు, సౌకర్యాలు, ఫీజులు, కార్పొరేట్ విద్య, ఉపాధ్యాయుల శిక్షణ, పరీక్షలు, ఫలితాలు, విద్యాసంవత్సరం నిర్వహణ తదితర అనేక సమస్యలపై ఇంత వరకూ విద్యార్థులే పోరాడేవారు. అయితే విద్యార్థుల తరఫున తల్లిదండ్రుల సంఘం కూడా ఉండాలనే సుదీర్ఘ ఆలోచన ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.
రాష్ట్రంలో అనేక సంఘాలున్నా, తల్లిదండ్రులకు సంఘం లేదని దానిని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల సంఘం ఏర్పాటుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించినట్టు టిపిఇఆర్‌ఎం ప్రధాన కార్యదర్శి నాగటి నారాయణ తెలిపారు. రాష్ట్ర స్థాయి సంఘం లేకపోవడం చాలా లోటుగా ఉందని, పిల్లల చదువుల సమస్యలు గురించి మాట్లాడే బలమైన సంఘం లేకపోవడం పెద్ద లోపంగా ఉందని దీనిని అధిగమించేందుకే ఈ సదస్సు నిర్వహించామని అన్నారు. సదస్సులో కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీ్ధర్, కేంద్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ మాజీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా, సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్, ప్రముఖ న్యాయవాది అశోక్ అగర్వాల్ పాల్గొన్నారు. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించి, నిర్దిష్టమైన డిమాండ్లు నిర్ణయించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని నాగటి నారాయణ చెప్పారు. రాష్ట్ర స్థాయి సంఘాన్ని రూపొందించి, నిర్వాహక కమిటీని ఎన్నుకున్నామని, రాష్ట్రంలో సరికొత్త ఉద్యమానికి బాటలు వేసే ఈ సదస్సులో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.