తెలంగాణ

కుప్పకూలిన భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. 11మంది కార్మికులు గాయపడిన సంఘటన సోమవారం సాయంత్రం ఎన్‌ఎఫ్‌సి నగర్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. కుషాయిగూడ ఎన్‌ఎఫ్‌సి పారిశ్రామికవాడలో కొత్తగా నిర్మిస్తున్న భవనం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. 40మంది కార్మికులు శ్లాబ్ వేస్తుండగా, ఇంకోవైపు శ్లాబ్ కుంగిపోయి ప్రమాదం సంభవించింది. శ్లాబ్ బరువు అధికమై కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న సెంట్రింగ్ కార్మికులు నర్సిహులు (38), సాదిక్ (35) అక్కడికక్కడే మృతిచెందారు. మరో 11మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించిన్నట్టు ఎన్‌ఎఫ్‌సి విభాగం పోలీసులు తెలిపారు.
ప్రమాదంపై అనుమానాలు...
ఎన్‌ఎఫ్‌సిలో నిర్మాణంలోవున్న భవనం కూలిపోయిన ఘటనలో అధికారులు నిర్లక్ష్యం స్పష్టమవుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాద వివరాలు బయటకు పొక్కకుండా అధికారులు గోప్యంగా వ్యవహరించటంపై కార్మిక సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క భవన నిర్మాణంలో కాంట్రాక్టర్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహారించడం వల్లే ప్రమాదం సంభవించిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు భవన నిర్మాణ పనుల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్రం..
ఎన్‌ఎఫ్‌సి పారిశ్రామికవాడలో కూలిన నిర్మాణంలోవున్న భవనం