తెలంగాణ

తప్పు సరిదిద్దుకునేందుకేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర కోసం పట్టుబట్టిన సిపిఎం రాష్ట్ర కమిటీ నేతలు ఇప్పుడు చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. నాడు ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోలేకపోయామని, తమ అభిమతాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశామన్న ఆత్మవిమర్శలో పడ్డారు. దీంతో తెలంగాణలో పార్టీ ఘోరంగా దెబ్బతిన్నందున మరమ్మతులకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ప్రజల్లోకి వెళ్ళేందుకు మొదటి అడుగు వేస్తున్నారు. ఆ బరువు, బాధ్యతను తానే మోస్తానని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముందుకు వచ్చారు. ఈ మేరకు సోమవారం (17న) రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మహాజన పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు, సామాజిక ఉద్యమ నేత డాక్టర్ ప్రకాష్ అంబేద్కర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభిస్తారు.
తమ్మినేని తపన..
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మళ్లీ పార్టీ తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొనేలా రాష్టమ్రంతా కలియతిరగాలని తమ్మినేని వీరభద్రం తపన. లోగడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో పాదయాత్రలు నిర్వహించినప్పుడు ప్రధాన రహదారులనే ఎంపిక చేసుకున్నారు. వారి యాత్రకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వెళ్ళేవారు. కానీ తమ్మినేని వీరభద్రం మాత్రం అలా కాకుండా ప్రతి గ్రామాన్ని సందర్శించాలని, అక్కడి ప్రజల సమస్యలు, ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్న ఆలోచనతో ఉన్నారు. తమ్మినేనికి తోడుగా పార్టీ నాయకులు జాన్‌వస్లీ, ఎస్. రమ, ఎంవి రమణ, ఎండి అబ్బాస్, పి. ఆశయ్య, కె. నగేష్, ఎం. శోభన్ నాయక్, నైతం రాజు పాదయాత్ర చేయనున్నారు. వీరికి మద్దతుగా ఆయా జిల్లా, మండలాలు, గ్రామాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. తమ్మినేని పాదయాత్ర బృందం పాదయాత్ర నాలుగు వేల కిలో మీటర్ల మేర కొనసాగుతుందని, ఈ యాత్ర సుమారు ఐదు నెలల పాటు జరిగే అవకాశం ఉందని అంచనా.
వెనకడుగు లేదు..
అయితే ఒకసారి పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తమ్మినేని దీమాగా చెబుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్‌లో మాట్లాడుతూ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందుతుంటే పాదయాత్రలెందుకని ప్రశ్నించారు. సిపిఎం యాత్రను అడ్డుకోవాలని టిఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో ఎక్కడైనా అవాంతరాలు ఎదురవుతాయేమోనన్న అనుమానాలు సిపిఎం నేతలకు లేకపోలేదు. కానీ తమ్మినేని మాత్రం ఎన్ని అవాంతరాలు ఎదురైనా కొనసాగించాలన్న పట్టుదలగా ఉన్నారు. పోలీసులు ఎక్కడైనా అరెస్టు చేస్తే, విడుదలయ్యాక మళ్లీ అక్కడి నుంచే కొనసాగించాలనుకుంటున్నారు. ప్రజా సంఘాలు, మేధావులూ మహాజన పాదయాత్రకు మద్దతునిచ్చి ఒక్క అడుగు నడవాలని తమ్మినేని కోరుతున్నారు.