తెలంగాణ

ఆరోగ్య బీమా పథకాల్లో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకాల్లో మార్పులు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ రెండు పథకాలకు సంబంధించి దేశంలోనే ఆదర్శవంతమైనదిగా ఉండాలని చెప్పారు. సిజెహెచ్‌ఎస్, ఇఎస్‌ఐ, సింగరేణి, ఇన్స్యూరెన్స్ కంపెనీల ఆరోగ్య పథకాలను పరిశీలించి ఉద్యోగుల, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ రూపొందించాలని చెప్పారు. అదే విధంగా ఆర్యోగ శ్రీ ఉద్యోగులను ఆరోగ్య శ్రీ , ఉద్యోగుల హెల్త్ స్కీమ్, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ వారిగా విభజన చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని మంత్రి ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఆరోగ్య శ్రీ సిఇఓ డాక్టర్ చంద్రశేఖర్, సిఇఓ డాక్టర్ కె పద్మ, డిఎంఇ డాక్టర్ రమణి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె మనోహర్ పాల్గొన్నారు.