రాష్ట్రీయం

దర్యాప్తు పూర్తయ్యేదెప్పుడు? బాధితులకు న్యాయం జరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: అధిక వడ్డీ, ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ వంటి ఆకర్షణీయమైన పథకాల పేరుతో పుట్టుకొచ్చి డిపాజిట్లు సేకరించి బోర్డులు తిప్పేసిన బోగస్ సంస్థలపై దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. గత నాలుగేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 50 లక్షల మంది ఖాతాదారులు రూ. 8,500 కోట్లు డిపాజిట్ చేసినట్టు సిఐడి గుర్తించింది. వివిధ సంస్థల్లో డిపాజిట్ చేసి మోసపోయిన వారిలో ఉద్యోగులు, వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు.
బొమ్మరిల్లు ఫార్మ్స్ అండ్ విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్, గోల్డ్ క్వెస్ట్ నెట్ ఇండియా ఎంటర్ ప్రైజెస్, అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రిస్, విఆర్ చిట్స్, సిమ్స్, ఆవని గోల్డ్ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేశవరెడ్డి స్కూల్స్, ఎన్ మార్ట్ రిటైల్స్ లిమిటెడ్, అక్షయ గోల్డ్ ఫార్మ్స్ అండ్ విల్లాస్ లిమిటెడ్, అభయ గోల్డ్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్, సిరి గోల్డ్ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు డిపాజిట్లను సేకరించిన వాటిలో ఉన్నట్టు సిఐడి గుర్తించింది. కాగా ఈ సంస్థల యాజమాన్యాలు పలు రాష్ట్రాలకు చెందిన అమాయక ప్రజల నుంచి తమ పెట్టుబడులపై అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, ల్యాండ్ డెవలప్‌మెంట్, కన్జూమర్ ప్రాడక్ట్స్, మంత్లీ సర్క్యులేషన్ స్కీం, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్టుల ఏర్పాటుతో లాభాలు గడించవచ్చని డిపాజిట్లు సేకరించాయి. వేల కోట్ల రూపాయలు సేకరించిన సదరు యాజమాన్యాలు తమ సంస్థల బోర్డులు తిప్పేశాయి. దీంతో తాము భారీ మొత్తంలో మోసపోయామని ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యాజమాన్యాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు భారీ మొత్తంలో మోసానికి పాల్పడిన సంస్థలపై ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. దీంతో ప్రభుత్వం ఈ కేసులను సిఐడికి అప్పగించింది. సుమారు 50వేల మంది ఏజెంట్లు, సూపర్‌వైజర్లు, టీం లీడర్లను పోలీసులు విచారించారు. వీరిలో పలువురు అరెస్టు కాగా, కొందరు తప్పించుకున్నారు. మరికొందరు తప్పించుకు తిరుగుతున్నట్టు సిఐడి అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో పదిమంది గుండెపోటుతో మృతి చెందారు. తమ కష్టపడి సంపాదించుకున్న డబ్బు బోగస్ సంస్థల్లో పెట్టి మోసపోయామని బెంగతో మరికొంతమంది ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు కూడా జరిగాయి. సుమారు పది బోగస్ సంస్థల్లో, అగ్రిగోల్డ్ సంస్థనే భారీ మోసానికి పాల్పడినట్టు సిఐడి గుర్తించింది.
తెలంగాణ, ఆంధ్రా, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన సుమారు 32 లక్షల మంది ఖాతాదారులు రూ. 6,380 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో 19.52 లక్షల మంది డిపాజిటర్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారుగా గుర్తించారు. కాగా అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్ సహ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాల తరువాత బాధితులకు చెల్లింపులు జరుగుతాయని సిఐడి అధికారులు తెలిపారు. ఇదిలావుండగా తమ డిపాజిట్లు తమకు కొంతమేరకైనా వస్తాయని అగ్రిగోల్డ్ బాధితుల్లో ఆశలు రేకెత్తుతుండగా మిగతా సంస్థలకు చెందిన బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1999, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్యులేషన్ పథకాల నిషేధ చట్టం 1978 ప్రకారం నిందితులపై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తు జరుగుతోందని సిఐడి పోలీసులు తెలిపారు.