తెలంగాణ

మిషన్ భగీరథలో ఆర్‌డబ్ల్యుఎస్ విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: మిషన్ భగీరథ పూర్తి చేయడంతో పాటు భవిష్యత్‌లో దీనిని నిర్వహించే బాధ్యత ఆర్‌డబ్ల్యుఎస్ శాఖదేనని సిఎం కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మురికి కాలువ నిర్మాణం తదితర పనులు కూడా ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ పరిధిలోనే ఉండటంతో పని భారం ఎక్కువ పడకుండా శాఖను పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ కార్యక్రమంపై రెండవ రోజు సోమవారం కూడా ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మిషన్ భగీరథకు ప్రత్యేకంగా మంత్రి లేరు. ఆ శాఖ నా వద్దే ఉంది. దీనికి వైస్ చైర్మన్‌గా నియమితులైన ప్రశాంత్‌రెడ్డికి కేబినెట్ హోదా కల్పించాం. ఆయన కూడా మంత్రితో సమానం. అధికారులతో సమీక్షలు నిర్వహించే అధికారం ఆయనకు ఉంది. స్వయంగా ఇంజనీర్ అయిన ప్రశాంత్‌రెడ్డి మంత్రులు, అధికారులతో సమన్వయం కుదురిస్తూ పర్యవేక్షిస్తారు’ అన్నారు. ఈ పథకం కోసం వివిధ ఆర్థిక సంస్థలు ఇప్పటికే రూ. 22 వేల కోట్లు రుణం ఇవ్వడానికి అంగీకరించాయి, మరో ఏడేనిమిది వేల కోట్ల రుణం వచ్చే అవకాశం ఉందని, ఇంకా అవసరం అయితే బడ్జెట్‌లో నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. నిధుల కొరత లేకపోవడంతో బిల్లులను వెంటవెంటనే చెల్లిస్తున్నామన్నారు. గడువులోగా పనులు పూర్తి చేసే ఏజెన్సీలకు 1.5 శాతం ఇనె్సంటివ్ చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితులలో డిసెంబర్ 2017 నాటికి పూర్తి చేసి ప్రజలకు 365 రోజుల పాటు 24 గంటలూ మంచినీళ్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం... మిషన్ భగీరథపై ఉన్నతస్థాయ సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్