తెలంగాణ

సిఆర్‌ఎఫ్ కింద 620 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: సెంట్రల్ రోడ్ ఫండ్ పద్దుకింద తెలంగాణకు అదనంగా 620 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. గతంలో ఈ పద్దు కింద కేంద్రం 400 కోట్ల మంజూరు చేసింది. తెలంగాణలోని రోడ్ల పరిస్థితిని వివరించి అదనపు నిధుల కోసం సిఎం కెసిఆర్, రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనేకసార్లు కేంద్రంతో చర్చించారు. దీంతో అదనంగా మరో 620 కోట్లు మంజూరయ్యాయి. దీంతో సెంట్రల్ రోడ్ ఫండ్ కింద కేంద్రం మొత్తం 1020 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి నితీష్ గడ్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపామన్నారు. కేంద్ర మంత్రి సహకారంతో ముందుముందు మరిన్ని జాతీయ రహదారులు, వాటి పనులకు అనుమతులు సంపాదించగలమని మంత్రి తెలిపారు. తెలంగాణకు సంబంధించి ఇంకా సుమారు మూడువేల కోట్లమేర ప్రతిపాదనలు కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నాయన్నారు. వీటికి అనుమతులు సిద్ధంగా ఉన్నాయని, సిఎం సహకారంతో త్వరలోనే అనుమతి సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. రెండోవిడత సిఆర్‌ఎఫ్ పథకం కింద మంజూరైన 620 కోట్ల రూపాయల పనుల వివరాలను మంత్రి వెల్లడించారు. ఆదిలాబాద్‌లో 44.1 కిలోమీటర్ల రోడ్డుకు 47 కోట్లు, కరీంనగర్‌లో 83.91 కిలోమీటర్ల మేర ఎనిమిది రోడ్డు పనులకు 83 కోట్లు, ఖమ్మంలో 74.70 కిలోమీటర్ల రోడ్డు పనులకు 76 కోట్లు మంజూరయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 92.05 కిలోమీటర్ల మేర పనులకు 90 కోట్లు, మెదక్‌లో 64.1 కిలోమీటర్ల రోడ్ల పనులకు 74 కోట్లు, నల్లగొండలో 71.2 కిలోమీటర్ల పనులకు 70 కోట్లు, నిజామాబాద్‌లో 55.94 కిలోమీటర్లమేర పనులకు 55 కోట్లు, రంగారెడ్డిలో 45.1 కిలోమీటర్ల రోడ్లకు 47 కోట్లు, వరంగల్‌లో 73.7 కిలోమీటర్ల మేర పనులకు 78 కోట్లు మంజూరయ్యాయి. పాత జిల్లాల తొమ్మిదింటిలో మొత్తం 604.8 కిలోమీటర్లలో 50 పనులకు కేంద్రం 620 కోట్లు మంజూరు చేసింది.

చిత్రం... భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు