తెలంగాణ

పునర్విభజనలో మార్పులు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ప్రభుత్వం హడావుడిగా ఏర్పాటు చేసినప్పటికీ, జిల్లాల పునర్విభజనలో ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ (టిజాక్) కోరింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఒక వినతిపత్రాన్ని టి-జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రతినిధులు పిట్టల రవీందర్, జి. వెంకటరెడ్డి, ఇటిక్యాల పురుషోత్తం, ఎస్. ప్రభాకర్‌రెడ్డి, బైరి రమేష్ సంయుక్తంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సచివాలయంలో సోమవారం కలిసి అందించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు సందర్భంగా ప్రజల నుండి వచ్చిన సూచనలను, మార్పులు, చేర్పులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు సందర్భంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న ప్రజలపై నమోదు చేసిన కేసులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనను అణచివేసేందుకు పోలీసు బలగాలను ఉపయోగించవద్దని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఈ అంశాలపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హామీ ఇచ్చారు. పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలని పోలీసు డిజిపి అనురాగ శర్మను టి-జాక్‌నేతలు కలిసి విన్నవించారు.