తెలంగాణ

జునో వ్యాలీలో వెయ్యికోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఔషధ రంగంలో హైదరాబాద్ నిర్మాణాత్మక పోషించనుందని పారిశ్రామిక మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఫార్మా రంగంలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయని వెల్లడించారు. హైటెక్ సిటీలో సోమవారం నిర్వహించిన బయో ఆసియా -2016 సదస్సును మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో మంత్రి మాట్లాడుతూ ఔషధ రంగంలో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారబోతోందని చెప్పారు.
ఔషధ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని జూపల్లి పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన 50 దేశాల ప్రతినిధుల్లో 8 కంపెనీల ప్రతినిధులు ఒక్కరోజులోనే వెయ్యి కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని పేర్కొన్నారు. ఫార్మా రంగానికి హైదరాబాద్ హబ్‌గా మారిందని, దీనికోసం రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఐదు వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి వివరించారు. దీనివల్ల స్థానికులకు ఉపాధితోపాటు దేశంలోనే ఫార్మా రంగంలో హైదరాబాద్ హబ్‌గా మారేందుకు దోహదపడుతుందన్నారు.