ఆంధ్రప్రదేశ్‌

ఆక్వా పార్కును ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, అక్టోబర్ 19: ప్రజా సంక్షేమం దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణం నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (జగన్) డిమాండ్‌చేశారు. ఈ పార్కును సముద్ర తీర ప్రాంతానికి తరలించి నిర్మిస్తే తమ పార్టీ మద్దతిస్తుందన్నారు. మెగా ఆక్వా పుడ్ పార్కుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా బుధవారం జగన్ ఇక్కడ పర్యటించారు. ఈసందర్భంగా పార్కు ప్రభావిత గ్రామాల్లో ఒకటైన కంసాలి బేతపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. పర్యావరణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నిర్మిస్తున్న ఈ కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వత్తాసు పలకడం అన్యాయమన్నారు. ఫుడ్‌పార్కు యాజమాన్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, గొంతేరు నుంచి పది కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీరంలో పార్కును నిర్మించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజల నుండి భూములు లాక్కోవడం ఫ్యాషన్‌గా మారిపోయిందని జగన్ ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో పోర్టు కోసం, భోగాపురంలో ఎయిర్‌పోర్టు కోసం, అమరావతిలో రాజధాని కోసం భూములు లాక్కున్నారన్నారు. ప్రజలపై జులుం ప్రదర్శిస్తూ, ఎదిరిస్తేకేసులు పెడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం ఎంతోకాలం సాగదని, చంద్రబాబు పరిపాలన రెండేళ్లు మాత్రమేనని, ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుందని, తమ పాలనలో ప్రజల అభీష్టం మేరకు అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ప్రజలు చేసే పోరాటానికి తమ పార్టీ మద్దతిస్తుందన్నారు. ప్రజాభీష్టాన్ని కాదని ఫుడ్‌పార్కు ఏర్పాటు చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును కూడా బంగాళాఖాతంలో కలిపేస్తామని జగన్ వాఖ్యానించారు.
అంతకుముందు ఫుడ్‌పార్కు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని, అరెస్టయి జిల్లాలోని తణుకు సబ్-జైలులో రిమాండులో ఉన్న ఆరేటి సత్యవతిని జగన్ పరామర్శించారు. ఆయన వెంట మాజీ మంత్రులు కె పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, వైసిపి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, కేంద్ర కమిటీ సభ్యుడు వంక రవీంద్రనాథ్, రాష్ట్ర కార్యదర్శి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, తానేటి వనిత, ముదునూరి ప్రసాదరాజు తదితరులున్నారు.
స్వల్ప ఉద్రిక్తత
కాగా జగన్ పర్యటనలో ఫుడ్‌పార్కు అనుకూల, వ్యతిరేక వర్గాల పోటాపోటీ నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ తుందుర్రు గ్రామానికి చేరుకోగానే ఫుడ్‌పార్కు వ్యతిరేక వర్గం ఘనంగా స్వాగతం పలికింది. అయితే, కాన్వాయ్‌లో అక్కడి నుంచి ముందుకు వస్తున్న జగన్‌కు తుందుర్రు గ్రామంలోని పెదపేట వద్ద ఫుడ్‌పార్కు అనుకూల వర్గం సైతం జగన్‌కు స్వాగతం పలికి దండలేసింది. మహిళలు, యువకులు ఫుడ్‌పార్కును వెంటనే నిర్మించాలని, ఉపాధి కల్పించాలన్న ఫ్లెక్సీలతో జగన్‌కు విజ్ఞాపనలు చేశారు. వైఎస్‌ఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జగన్ వారితోనూ కొద్దిసేపు మాట్లాడారు. ఈ సమయంలో పార్కు వ్యతిరేక వర్గం గట్టిగా నినాదాలు చేసింది. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశంచేసి పరిస్ధితిని చక్కదిద్దారు.

చిత్రం... బహిరంగ సభలో మాట్లాడుతున్న జగన్