తెలంగాణ

సెంట్రల్ వర్శిటీ ఖ్యాతిని పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితుడైన డాక్టర్ ఒ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జాగృతి గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఒఎస్ రెడ్డి సామాజిక, సాంకేతిక రంగాల్లో సెంట్రల్ యూనివర్శిటీల్లో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని అన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఒఎస్ రెడ్డిని ఇసి సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్శిటీలో పిహెచ్‌డి, ఎంఫిల్, ఎంఎస్సీ చేసిన ఒ ఎస్ రెడ్డి యూరప్, ఆసియాలోని అనేక దేశాల్లో పర్యటించి విద్యావ్యవస్థను అధ్యయనం చేశారు. జాగృతి విద్యాసంస్థలతో పాటు రోనాల్డ్ రాస్, కరుణ పిజి కాలేజీ, రచన కాలేజ్ ఆఫ్ జర్నలిజం ట్రెజరర్‌గానూ పనిచేశారు. వైస్‌మెన్ ఇంటర్నేషనల్‌కు అంతర్జాతీయ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా, జివిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడిగా, ఎపి కన్జ్యూమర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా, వైఎంసిఎ యూనివర్శిటీ స్టూడెంట్స్ సర్కిల్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

ట్యాంక్ బండ్‌పై
బసవేశ్వర విగ్రహం

సిఎం కెసిఆర్ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 8: హైదరాబాద్ ట్యాంక్ బండ్పై వీరశైవుల బస్వేశ్వర విగ్రహం ప్రతిష్టించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సోమవారం అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.