తెలంగాణ

గ్రామాలకు వెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రభుత్వం నుండి ప్రజలు మరింత ఎక్కువ సేవలు ఆశిస్తున్నారని, అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లా పంచాయితీ అధికారులు (డిపిఓలు), పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆయన ఇక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, పంచాయితీలకు రాజ్యాంగ సవరణలకు అనుగుణంగా అధికారాలను ఇస్తున్నామని, ఇంకా ఎక్కువ అధికారాలను కూడా ఇస్తున్నామన్నారు. పంచాయితీలు కూడా బాధ్యతగా పనిచేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు అర్హులకు మాత్రమే చేరాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జిల్లాసాయి అధికారులు నెలకు కనీసం 20 రోజుల పాటు గ్రామాల్లో పర్యటించాలని, ఈ వివరాలను వాట్సాప్‌లోనూ, వెబ్‌సైట్‌లోనూ ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మండలస్థాయి అధికారులు తప్పని సరిగా గ్రామాల్లో పర్యటిస్తూ పనులు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని కోరారు. కిందిస్థాయి సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. పంచాయితీ కార్యదర్శులు తాము పనిచేసే గ్రామాల్లోనే నివసిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేనిపక్షంలో వారిపై చర్య తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కార్యదర్శులు స్థానికంగా నివసించకపోతే మండలస్థాయి అధికారులను బాధ్యులను చేస్తామన్నారు.