తెలంగాణ

గొర్రెల సమాఖ్యకు రూ.400కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు కేంద్రం నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను జత చేసి పావలా వడ్డీకే రుణం పథకం వర్తింప జేయాలని నిర్ణయించారు. గొర్రెలు, మేకల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మత్స్య సంఘాల వలె యాదవ సంఘాలు కూడా బాగా పని చేసి తమ కుటుంబాల్లోని పిల్లలను బాగా చదివించుకోవాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించిన కనె్నబోయిన రాజయ్య యాదవ్ సహకార సమాఖ్య చైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు మంత్రులు మాట్లాడారు. రాష్ట్రంలోని కురుమలు, యాదవులు కలిసి ఉండాలని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కడియం శ్రీహరి చెప్పారు. ఈ సమాఖ్యకు కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని ఈ నిధులను వివిధ జిల్లాలలోని సొసైటీల ద్వారా గొర్రెలు, మేకల అభివృద్ధికి వినియోగించాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ఈ పథకం కింద కేంద్రం ఇచ్చే నాలుగు వందల కోట్ల రూపాయలకు వడ్డీ ఎక్కువ అని విషయం తన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వం తరఫున వంద కోట్ల రూపాయలు భరించి ఈ పథకం కింద లబ్దిదారులకు పావలా వడ్డికే రుణం వర్తింపజేయాలని నిర్ణయించినట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 104, 108 వైద్య సహాయం మాదిరిగానే వెటర్నరీ ఆస్పత్రులకు 109 నంబర్‌పై ప్రత్యేక వైద్య వాహనాన్ని ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. బిసిలకు 119 ఆశ్రమ పాఠశాలలు మంజూరు చేశారన్నారు.

సహకార సమాఖ్య చైర్మన్‌గా రాజయ్య యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి కడియం