తెలంగాణ

రూ. 350 కోట్లతో 1400 కొత్త బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ ఆర్టీసి రూ.350 కోట్లతో త్వరలో 1400 కొత్త బస్సులను కొనుగోలు చేసే ప్రణాళికను రాష్ట్రప్రభుత్వం ఆమోదించినట్లు రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ బస్ భవన్ వద్ద హైదరాబాద్-నిజామాబాద్, హైదరాబాద్-వరంగల్ మధ్య ప్రవేశపెట్టిన ఏసి మినీ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మినీ ఏసి బస్సులకు వజ్ర అని నామకరణ చేశామన్నారు. త్వరలో వంద మినీ ఏసి బస్సులను హైదరాబాద్ నుంచి వివిధ గమ్య స్థానాలకు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రవాణా సదుపాయం లేని గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం కల్పించే దిశలో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రయాణీకుల అవసరాల మేరకు బస్సులు నడపడమే కాకుండా వజ్ర ఏసి మినీ బస్సులతో టిఎస్‌ఆర్టీసి ప్రజా రవాణా రంగంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. హైదరాబాద్ నగరంలో చిన్నపాటి రోడ్లతో రద్దీగా ఉండే చార్మినార్ ప్రాంతంలో మినీ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణీకుల ఆదరణ మేరకు వజ్ర సర్వీసులను పెంచుతామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకండా లగేజితో సహా ప్రయాణించేందుకు సౌకర్యంగా ఉండే ఏసి మినీ బస్సుల ద్వారా వారిని గమ్యస్థానాలకు చేర్చి ప్రయాణీకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. నష్టాల నుంచి గట్టెక్కేందుకు 25 శాతం మేర టర్నోవర్‌ను పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో
వజ్ర మినీ బస్సులను ప్రారంభించిన మంత్రి మహేందర్‌రెడ్డి,
చైర్మన్ సోమారాపు సత్యనారాయణ
సకాలంలో పోలవరం