తెలంగాణ

డాక్టర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓ డాక్టర్‌పై కాల్పులకు పాల్పడిన ఘటనలో నిందితుడు శశికుమార్ మంగళవారం తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హిమాయత్‌నగర్‌లో ఇద్దరు డాక్టర్ల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారి తీసి కాల్పులకు దారితీసిన విషయం విదితమే. సంఘటనలో డాక్టర్ ఉదయ్‌పై కాల్పులకు పాల్పడిన శశికుమార్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లిలోని నిశా ఫాంహౌస్‌లో రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగినట్టయ్యంది. డాక్టర్ శశికుమార్ మృతదేహం వద్ద రివాల్వర్‌తోపాటు సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్లు చైతన్య, కెవి రెడ్డి తనకు 1.30కోట్లు ఇవ్వాల్సి ఉందని, డాక్టర్ ఉదయ్‌పై కాల్పులు జరిపింది తానుకాదని, డాక్టర్ సాయికుమారేనని శశికుమార్ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలే గొడవకు కారణమని నోట్‌లో వెల్లడించినట్టు సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్‌రెడ్డి చెప్పారు. డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య, డాక్టర్ ఉదయ్‌పై జరిగిన కాల్పుల ఉదంతంపై అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుపుతున్నట్టు వివరించారు.
కాగా, తన భర్తది ఆత్మహత్య కాదని డాక్టర్ శశికుమార్ భార్య క్రాంతి తెలిపారు. ఉదయ్‌పై తన భర్త కాల్పులు జరిపినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. సంఘటనకు ముందు రోజు రాత్రే తన భర్తను సాయికుమార్, ఉదయ్ కిరాయి హంతకులతో కలసి పథకం ప్రకారం కిడ్నాప్ చేసి కాల్చి చంపారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు తన భర్తే కాల్పులు జరిపినట్టు చిత్రీకరించారన్నారు. కేసులో తగిన న్యాయం చేయాలని క్రాంతి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కాల్పుల కేసులో డాక్టర్ల స్నేహితురాలు, ఫామ్ హౌస్ యజమాని చంద్రకళపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.