తెలంగాణ

నెలకు 3 లక్షలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతభత్యాలు పెంచడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి, అసెంబ్లీ కార్యదర్శికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ అంశంపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆసెంబ్లీ కార్యదర్శి రాజా సదారామ్, ఆర్థికశాఖ అధికారులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చర్చించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఎమ్మెల్యేల జీతాలు పెంచిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా జీతాలు పెంచాలని అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తం అయింది. ప్రస్తుతం మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, విప్‌లు, ప్రతిపక్ష నేత కేబినెట్ ర్యాంకు జీతాన్ని పొందుతున్నారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు రూ. 95 వేల జీతాన్ని పొందుతున్నారు. వీరిందరికీ చెల్లిస్తున్న జీతాలను కలిపితే ఏడాదికి రూ.14.94 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఆమోదించే బడ్జెట్ రూ. లక్షా 15 వేల కోట్ల ఉండగా, అందులో వీరు పొందుతున్న వేతనాలు 0.001 శాతం మాత్రమేనని అంచన వేసింది. అయితే బయట మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలపై ప్రజలకు విపరీతమైన అపోహలున్నాయి. వాస్తవానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నెలవారీగా వచ్చే ఖర్చులతో పోలిస్తే వీరు పొందుతున్న జీతాలు ఏ మాత్రం సరిపోవన్న అభిప్రాయం వ్యక్తం అయింది. ఎమ్మెల్యేలకు రాజకీయ, రాజకీయేతర ఖర్చులుంటాయి. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, రాష్ట్ర రాజధాని చుట్టూ తిరగాల్సి ఉంటుంది. వివిధ కమిటీల్లో సభ్యులుగా ఉండటం వల్ల వాటి పర్యటనలు, సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే శుభకార్యాలకు, అశుభకార్యాలకు వెళ్లాల్సి ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌కే పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు గన్‌మెన్లు, డ్రైవర్ల భోజనాలు, ఇతర ఖర్చులను భరించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. అధికారికంగానే కాకుండా వ్యక్తగతంగా ఆర్థిక సహాయం అందించడం వంటి ఖర్చులు ఉంటాయి. మారిన జీవన శైలికి అనుగుణంగా కుటుంబ ఖర్చులుంటాయి. వీటిన్నింటికి కలిపి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇవన్నీ ముఖ్యమంత్రితో జరిగిన చర్చ సందర్భంగా అధికారులు వివరించారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ సభ్యులకు రూ. 4 లక్షల వరకు జీతాన్ని ఇవ్వాలని అక్కడి అసెంబ్లీ ప్రతిపాదించిన అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. వివిధ రాష్ట్రాలలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు చెల్లిస్తున్న జీతభత్యాల వివరాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇవన్నీ చర్చించిన అనంతరం రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలు పెంచాలని, అలాగే అదే నిష్పత్తిలో కేబినెట్ ర్యాంకున్న సభ్యుల జీతాలు పెంచే విషయంపై కసరత్తు చేశారు. వీరందరికీ జీతాలు పెంచే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.