తెలంగాణ

అవగాహన లేమి.. అనారోగ్యాలకు మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక రోగాల సమస్యలకు మూలం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా రుమటోలజీ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్ జల విహార్‌లో చేపట్టిన వాక్ టు సపోర్ట్ ఆర్థరైటిస్ అవేర్‌నెస్ నడకను మంత్రి ప్రారంభించారు. అవగాహన, తగిన చైతన్యం ఉంటే అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. అనేక జబ్బుల మాదిరిగానే మోకాళ్ల నొప్పుల కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. కాన్సర్ లాంటి జబ్బులు ముదురుతున్నాయని, కొద్దిపాటి జాగ్రత్తలతో రోగుల ప్రాణాలను కాపాడవచ్చునని అన్నారు. జబ్బుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. డెంగీ, మలేరియా వంటి విష జ్వరాల నివారణ మీద ఏజెన్సీ ప్రాంతాల్లో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారం మంచి ఫలితాలను ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ వైద్యాన్ని మరింత అభివృద్ధి పరుస్తున్నామని, ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేస్తున్నామని చెప్పారు. అధునిక సదుపాయాలతో పాటు డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తున్నట్టు చెప్పారు. ఆర్థరైటిస్ రంగంలో మరింత మంది వైద్యుల నియామకం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది , డాక్టర్లు, పిజి విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.