తెలంగాణ

రైతులకు అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అవమానం జరుగుతోందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తోందని తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూనే రైతుల సమస్యలు పరిష్కరించడం లేదని ఆయన ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక రోజు రైతు దీక్షలో ఆయన ప్రసంగిస్తూ, 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలస్తంభమన్నారు. వ్యవసాయం బాగుంటేనే వ్యాపారాలు నడుస్తాయని కోదండరాం అన్నారు. ప్రభుత్వం తక్షణమే సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురావాలని, విత్తన చట్టం, రైతు ఆదాయ, భద్రత చట్టం తేవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుకు సామాజిక భద్రత కల్పించాలని కోదండరాం కోరారు. విచ్ఛలవిడి భూసేకరణ ఆపాలని, రైతుల భూమికి బదులు భూమి ఇవ్వాలని స్పష్టం చేశారు. భూములు ఇస్తేనే కంపెనీలు వస్తాయనుకోవడం అవివేకమని, వ్యవసాయ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, రైతుల సగటు అప్పు రూ.93వేలు ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం పూర్తిగా రుణాలు మాఫీ చేయడం లేదు.. బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు.. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ విధానాలు కూడా రైతులను కుంగదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసమే దీక్ష చేపట్టినట్టు కోదండరాం స్పష్టం చేశారు. రైతు దీక్షకు భారీ స్పందన లభించింది. పలు సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో 800 మందికి పైగా రైతులు, రైతు సంఘాల నాయకులతోపాటు జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ రమా మేల్కొటె, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, జనార్దన్‌రెడ్డి తదితరులు దీక్ష శిబిరానికి చేరుకొని తమ సంఘీభావం తెలిపారు.

చిత్రం... హైదరాబాద్‌లో ఆదివారం రైతు దీక్షలో పాల్గొన్న కోదండరాం