తెలంగాణ

వ్యవసాయ వర్శిటీలో 26,27న కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరే స్పెషల్ క్యాటగిరీ విద్యార్థులకు ఈ నెల 26-27 తేదీల్లో కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నారు. 26న ఉదయం 10 గంటలకు డిఫెన్స్ కోటా, మధ్యాహ్నం 2 గంటలకు ఎన్‌సిసి కోటా సీట్లకోసం కౌనె్సలింగ్ జరుగుతుందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్‌కుమార్ తెలిపారు. 27 న వికలాంగుల కోటా భర్తీకి కౌనె్సలింగ్ నిర్వహిస్తామన్నారు. స్పోర్ట్స్ కోటా కింద సీట్లభర్తీకి త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని సుధీర్‌కుమార్ తెలిపారు. విద్యార్థులెవరికైనా ఇతర వివరాలు కావాలంటే యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.