తెలంగాణ

రాష్ట్రంలో ప్రజాకంటక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 24: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాకంటక పాలన కొనసాగిస్త్తూ మైండ్ గేమ్‌తో అందరినీ తప్పుదోపట్టిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తీవ్రస్థాయలో ధ్వజమెత్తారు. తమ జేబు సంస్థలతో దొంగ సర్వేలు చేయంచుకుని మళ్లీ తెరాస అధికారంలోకి వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 119 సీట్లకు 100 సీట్లు వస్తాయని విర్రవీగుతున్న సిఎం కెసిఆర్‌కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలిపించాలని సవాల్ విసిరారు. ఎన్నికలు నిర్వహిస్తే తెరాసకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై సోమవారం సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట బిజెపి మహా ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో డా.లక్ష్మణ్ ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, రైతు సంక్షేమం కోసం పాటుపడుతామని అధికారంలోకి వచ్చిన తెరాస రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. కెసిఆర్ సర్కారు అధికారం చేపట్టిన రెండేళ్లలోనే 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అందుకే అన్నదాతలను ఆదుకనేందుకు సిద్దిపేట నుంచే బిజెపి రైతుపోరుయాత్రకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కింద 4 వేల చెరువులకు మరమ్మతులు చేస్తే సగానికి పైగా చెరువులకు గండ్లుపడ్డాయని, ఇది పూర్తిగా ‘కమీషన్ కాకతీయ’ పథకంగా మారిందని లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉంటే విద్యార్థులకు రూ.2 వేల కోట్ల ఫీజురియింబర్స్‌మెంట్ ఎందుకు చెల్లించడం లేదని ఆయన కెసిఆర్‌ను నిలదీశారు. విశ్వనగరమైన హైదరాబాద్‌ను విషనగరంగా మార్చుతున్నారన్నారు. హైద్రాబాద్‌లో రోడ్లమరమ్మతులకు రూ.300 కోట్లు కేటాయిస్తే రూ.100 కోట్లు స్వాహా చేశారని నిప్పులు చెరిగారు. రైతులకు కరవుభత్యం అందించే దాకా బిజెపి ఆందోళనలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న పాలకులను గ్రామాల్లో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గపక్షాన రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు నాగలిని బహూకరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మహా ధర్నాలో ప్రసంగిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్