తెలంగాణ

మెడికో ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 25: వైద్య విద్య లక్ష్యంగా ఎంసెట్‌లో 167 ర్యాంకు సాధించిన మెడికో అకస్మాత్తుగా తనువు చాలించాడు. ఉస్మానియా వర్శిటీలో ఎంబిబిఎస్ తొలి ఏడాదిలో చేరి రోజులు పూర్తికాకముందే యానాల సాయికుమార్‌రెడ్డి (19) చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ పట్టణంలోని శ్రీ లక్ష్మీసాయి టవర్స్ ఐదో అంతస్తు నుంచి అర్థరాత్రి సమయంలో కిందకుదూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం, ట్రస్మా ఉపాధ్యాయ సంఘ నేత యానాల ప్రభాకర్‌రెడ్డి రెండో కుమారుడు సాయికుమార్‌రెడ్డి ఇటీవల ఉస్మానియా మెడికల్ కళాశాల్లో వైద్య విద్య మొదటి ఏడాదిలో చేరాడు. చేరిన దగ్గర్నుంచీ మెడికల్ సిలబస్ కష్టంగా ఉందంటూ మనస్తాపానికి గురవుతున్నాడు. మూడు రోజుల క్రితం తల్లిదండ్రుల వద్దకొచ్చిన సాయికుమార్, చదువులో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను తండ్రికి వివరించినట్టు చెబుతున్నారు. దీనిపై తండ్రి ప్రభాకర్‌రెడ్డి సర్దిచెబుతూ, క్లాసులు ఆరంభ దశలోనే ఉన్నాయి కనుక కొద్దిరోజులు ఆగి అధ్యాపక బృందంతో మాట్లాడొచ్చునని అనునయించాడు. సోమవారం మిర్యాలగూడకు వెళ్లిన ప్రభాకర్‌రెడ్డి రాత్రి 11.30 సమయంలో ఇంటికి చేరుకున్నాడు. తండ్రి వచ్చేవరకూ ఎదురు చూసిన సాయికుమార్, చివరిసారి తండ్రిని కలిసి తన గదిలోకి వెళ్లిపోయాడు. అర్థరాత్రి సమయంలో ఐదో అంతస్తునుంచి కిందకు దూకి ప్రాణాలు విడిచాడు. కొడుకు భవనంపై నుంచి దూకడాన్ని గమనించిన తండ్రి ప్రభాకర్‌రెడ్డి షాక్ నుంచి తేరుకుని కిందికి పరుగులు తీసినా ప్రయోజనం లేకపోయింది. రక్తపుమడుగులో పడివున్న సాయికుమార్‌ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. డాక్టర్ కావాల్సిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. తనను వైద్యుడిని చేయాలన్న తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేనన్న భయం, వైద్య విద్యలోని ఒత్తిడి తట్టుకోలేక సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితమే మిర్యాలగూడకు చెందిన మెడికో సంధ్యారాణి గుంటూరు సర్వజనా మెడికల్ కాలేజీలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే, మరో మెడికో సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఆత్మహత్యకు పాల్పడిన
సాయికుమార్‌రెడ్డి (పాత చిత్రం)