తెలంగాణ

వేగంగా.. ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ప్రస్తుత సచివాలయంలోని కార్యాలయాల తరలింపు, భవనాల కూల్చివేత, కొత్త సచివాలయ నిర్మాణం, ప్రారంభోత్సవం వరకు ఎప్పుటి నుంచి ఏది జరగాలో షెడ్యూల్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. సచివాలయం కూల్చివేత పనుల నుంచి కొత్త భవన నిర్మాణం వరకు ఆర్ అండ్ బి శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో రెండు ఆప్షన్లను ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం. సచివాలయంలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన భవనాలను మాత్రమే కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాల్సిన పక్షంలో ఒక ప్రతిపాదన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన భవనాలను కూడా కూల్చివేసి పక్షంలో నిర్మాణంపై మరో ప్రతిపాదనను ఆర్ అండ్ బి శాఖ ప్రభుత్వం ముందు రెండు వేర్వేరు ప్రతిపాదనలను అందజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన బ్లాక్‌లను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అందజేసిన విషయం తెలిసిందే. తమకు కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు అనధికారిక సమాచారం మాత్రమే ప్రభుత్వానికి అందింది. అధికారికంగా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో తెలంగాణకు కేటాయించిన భవనాలను మాత్రమే కూల్చివేసి 5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ.180 కోట్లతో భవనం నిర్మించడం మొదటి ప్రతిపాదన కాగా, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను అప్పగించేపక్షంలో 8లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ.350 కోట్లవ్యయంతో కొత్త సచివాలయాన్ని నిర్మించడం రెండో ప్రతిపాదన. సమయాన్ని వృథా చేయకుండా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాల కోసం ఎదురు చూడకుండా మొదట తెలంగాణకు కేటాయించిన భవనాలను కూల్చివేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుత సచివాలయ భవనం నుంచి కార్యాలయాల తరలింపు కార్యక్రమాన్ని దీపావళి తర్వాత చేపట్టి పది నుంచి 15 రోజుల వ్యవధి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడి నుంచి కార్యాలయాల తరలింపు కోసం ఇప్పటికే భవనాల ఎంపిక పూర్తి అయింది. సచివాలయానికి సమీపంలో ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవనం (బిఆర్‌కె భవన్), జలసౌధ, చంద్రవిహార్, గృహకల్ప, డిటిడిసి భవనాలను ప్రాథమికంగా గుర్తించింది. కార్యాలయాల తరలింపు ఒకవైపు జరుగుతుండగానే కార్తిక మాసంలో కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కార్యాలయాల తరలింపు, కూల్చివేతలు, నేల చదును తదితర పనులకు నెల నుంచి నెలన్నర వ్యవధి పడుతుందని, డిసెంబర్ నెలాఖరుకల్లా ఈప్రక్రియ పూర్తి చేసి జనవరిలో కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి 2018 జనవరి నాటికి ప్రారంభించాలని ప్రాథమిక సచివాలయ నిర్మాణ ప్రాథమిక రోడ్ మ్యాప్ షెడ్యూల్‌ను ప్రభుత్వ ఖరారు చేసినట్టు అధికార వర్గాల సమాచారం.