హైదరాబాద్

వసూళ్లే బల్దియా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: మహానగర పాలక సంస్థ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, వసూళ్లే ముఖ్యమైన లక్ష్యంగా కన్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పలు పథకాల అమలు, సేవా పేరిట జిహెచ్‌ఎంసి ఇప్పటికే అమలు చేస్తున్న పలు కార్యక్రమాల కారణంగా మున్ముందు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలుండటంతో గత కొంతకాలంగా నిధుల సమీకరణపై పూర్తిగా దృష్టి సారించింది. ఫలితంగా ఇప్పటికే వివిధ రకాల పన్నులు, ఛార్జీలు చెల్లిస్తున్న నగరవాసులు మున్ముందు చెత్తకు కూడా ఛార్జీలను చెల్లించాల్సి వస్తోంది. ఇందులో భాగంగానే నగర ప్రజలకు ఉచితంగా అందించాల్సిన జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ, పారిశుద్ద్య విధులకు సైతం ఛార్జీలను వర్తింపజేస్తోంది. ఇందులో ఇప్పటికే ఈసేవా, మీ సేవాలకు సేవలను అనుసంధానం చేసి, బర్త్,డెత్ సర్ట్ఫికెట్ల జారీకి సంబంధించి ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 30 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే! అంతేగాక, పదహారేళ్ల క్రితం సవరించిన ఆస్తిపన్ను పెంపుకు అనుమతించాలని ఇప్పటికే సర్కారుకు లేఖ రాసిన జిహెచ్‌ఎంసి త్వరలోనే చెత్తపై యూజర్ ఛార్జీలను వసూలు చేసేందుకు రంగం సిద్దం కానుంది. ఇప్పటికే ఈ అంశంపై స్థారుూ సంఘంపై సుదర్ఘీమైన చర్చ జరిగిన నేపథ్యంలో కొత్తగా ప్రతిపాదించిన ముప్పై సర్కిళ్లు అమల్లోకి రాగానే ఈ ఛార్జీలను వసూలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే క్యాటగిరీల వారీగా కనిష్ఠంగా రూ. 50, గరిష్ఠంగా వ్యాపార సముదాయాలకు రూ. 5వేల వరకు వసూలు చేసేందుకు ఛార్జీలను కూడా నిర్ణయించిన సంగతి తెలిసిందే! ప్రతి గృహాం, వ్యాపార సంస్థ, సముదాయాల నుంచి వచ్చే చెత్తను బట్టి ఈ ఛార్జీలను నిర్ణయించారు. అయితే ఇప్పటికే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం కింద నగరం నుంచి చెత్తను వీలైనంత త్వరగా తొలగించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా సుమారు 1700 పై చిలుకు ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టిన జిహెచ్‌ఎంసి తొలుత ప్రజలు ఎలాంటి ఛార్జీలనుల చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతూనే, చెత్తను సేకరించేందుక వచ్చే ఆటో డ్రైవర్, స్వచ్ఛ సహాయకుడు ఒక్కో ఇంటి నుంచి రూ. 50 వసూలు చేసుకోవచ్చునని వౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అయితే త్వరలోనే చెత్తపై వసూలు చేసే యూజర్ ఛార్జీలకు బల్దియా చట్టబద్దత కల్పించేందుకు సిద్దమవుతోంది. కానీ ఇప్పటికే నివసిస్తున్న ఇంటికి ఆస్తిపన్ను, రోడ్డు ట్యాక్సు, ఎక్కడ వాహనం ఆపినా పార్కింగ్ ఛార్జీలు చెల్లిస్తున్న తాము మళ్లీ చెత్తకూడ కూడా యూజర్ ఛార్జీలెందుకు చెల్లించాలని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. రెండురోజుల క్రితం తాజాగా ప్రజా ఆరోగ్యభద్రత పేరిట నగరంలో మాంసాహారాన్ని విక్రయించే హోటళ్లు జిహెచ్‌ఎంసి స్లాటర్ హౌజ్‌ల నుంచే కొనుగోలు చేయాలని, జిహెచ్‌ఎంసి ఆమోద ముద్ర లేని మాంసాహారాన్ని(మిగతా 8వ పేజీలో)
విక్రయిస్తే చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ రకంగా జిహెచ్‌ఎంసి పాలక మండలి, అధికార యంత్రాంగం కూడా ఖజానా నింపేందుకు ప్రజలపై ఆర్థిక భారం మోపే దిశగా ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు తప్పుదోవపడుతున్నారు. ఈ చెత్త యూజర్ ఛార్జీలపై ఆందోళన చేపట్టేందుకు విపక్షాలు కూడా సిద్దమవుతున్నాయి.

మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌కు నిరసన
జైళ్లలో మావోయిస్టు
ఖైదీల ఆందోళన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, కుషాయిగూడ, అక్టోబర్ 26: ఒడిశాలోని మల్కన్‌గిరి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ జైళ్లలోని మావోయిస్టు ఖైదీలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని వరంగల్, చర్లపల్లి సెంట్రల్ జైళ్లలోగల మావోయిస్టు ఖైదీలు ఉదయం అల్పాహారాన్ని మానేసి తమ నిరసనను వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 31 మంది మావోయిస్టులతోపాటు ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా జైళ్లలో ఉన్న మావోయిస్టు ఖైదీల నిరసనల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సందర్శకులపై గట్టి నిఘా వేసి ఉంచారు. కొన్ని జైళ్లలో ములాఖత్ పేరిట వచ్చే వారి కదలికలపై నిఘా పెంచారు. మరికొన్ని జైళ్లలో ములాఖత్‌కు వచ్చే వారికి అనుమతివ్వడం లేదు. ఏవోబిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతీకారంగా ఎలాంటి దాడులకైనా పాల్పడవచ్చని పోలీసులు తనిఖీలు (మిగతా 8వ పేజీలో)
ముమ్మరం చేశారు. మావోయిస్టు ప్రాబల్యం గల ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ దళాలతో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల సరిహద్దులో పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు, మాజీ మావోయిస్టుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. తెలంగాణలోని ప్రధాన పట్టణాలతోపాటు నగర శివారుల్లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. గస్తీ ముమ్మరం చేసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
అలాగే చర్లపల్లి కేంద్ర కారాగారంలో విధుల ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇవ్వరాదని ఉన్నత అధికారులు స్పష్టమైన అదేశాలు జారీ చేసినట్టు సమాచారం.