తెలంగాణ

జడ్పీ సమావేశం రసాభాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 26: మహబూబ్‌నగర్ జిల్లా జడ్పీ సమావేశం రసాభాసగా కొనసాగింది. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు, మాటల యుద్ధం, నిరసనలతో బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశం దద్దరిల్లింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన చర్చ వాదోపవాదాలకు దారితీసింది. ఏకంగా టిఆర్‌ఎస్ జడ్పీటిసిలు, ఎంపిపిలు కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిపై తీసుకెళ్లి చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ జడ్పీటిసిలు, ఎంపిపిలు సైతం తెరాస జడ్పీటిసిల వైపు దూసుకువచ్చి తోపులాటకు దిగారు. ఓ దశలో ఏమి జరుగుతుందోనని అందరు ఆందోళన చెందారు. ఇంతలోపే పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కల్పించుకుని తెరాస, కాంగ్రెస్ సభ్యులను సముదాయించే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉండగా జడ్పీ సమావేశంలో జిల్లాల విభజన రగడ కూడా కొనసాగింది. నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేయాలంటూ పలువురు జడ్పీటిసిలు, ఎంపిపిలు నిరసనకు దిగారు. పోడియం ముందు బైఠాయించి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మూడు జిల్లాలు చేసి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో కొత్తగా నారాయణపేట జిల్లాను ఎందుకు చేయలేదని ఆ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల జడ్పీటిసిలు, ఎంపిపిలు మంత్రి జూపల్లితో వాగ్వాదానికి దిగారు. దౌల్తాబాద్ మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లా నుండి ఎందుకు విడదీశారని, మండలంలో ఏ ఒక్కరు కూడా దౌల్తాబాద్‌ను వికారాబాద్ జిల్లాలో కలపమని ఒక్క వినతిపత్రం కూడా ఇవ్వలేదని, అలాంటప్పుడు జిల్లా నుండి ఎందుకు వీడదీశారని తమను మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉంచాలంటూ ఆందోళనకు దిగారు. మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇంతలోపే పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి కల్పించుకుని గండీడు మండలాన్ని వికారాబాద్ జిల్లాలో చేర్చాలని మహబూబ్‌నగర్ జిల్లాలో వద్దంటూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిల మధ్య జరిగిన కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకం సమాంతర కాలువలు, కల్వకుర్తి లిఫ్ట్‌కు జరిగే ప్రమాదం అంశం ఒక్కసారిగా జడ్పీ సమావేశాన్ని కుదిపివేసింది. జిల్లాలో ఇంకా మండలాలు, రెవెన్యూ డివిజన్ల డిమాండ్లు ఉన్నాయని వాటిపై పరిశీలించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని వివిధ మండలాల జడ్పీటిసిలు, ఎంపిపిలు సమావేశంలో పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పలుమార్లు టిఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం వంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా కొనసాగింది.

నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేయాలంటూ జడ్పీ సమావేశంలో పోడియం ముందు ధర్నా చేస్తూ మంత్రి జూపల్లితో వాగ్వివాదానికి దిగిన జడ్పీటిసిలు, ఎంపిపిలు... కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, టిఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట